News March 1, 2025

KMR: 12579 విద్యార్థులు.. 54 సెంటర్లు

image

పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న వేళ అధికారులు సర్వం సిద్ధం చేసే పనిలో ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో పదో తరగతిలో 12,579 విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందు కోసం జిల్లాలో 54 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పదో తరగతి వార్షిక పరీక్షలు మాల్ ప్రాక్టీస్‌కు తావివ్వకుండా, పకడ్బందీగా నిర్వహించాలని శుక్రవారం నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులకు ఆదేశించారు.

Similar News

News March 16, 2025

మంచిర్యాల: తండ్రిపై దాడికి సుపారీ ఇచ్చిన కొడుకు

image

తండ్రిపై దాడి చేయించేందుకు సుపారీ ఇచ్చిన కొడుకుతో పాటు ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు రూరల్ CI అశోక్ తెలిపారు. మంచిర్యాల జిల్లా వేంపల్లికి చెందిన సత్యానందం, కొడుకు రమేశ్‌కు కుటుంబ కలహాలు ఉన్నాయి. దీంతో పలువురికి రూ.50వేలు ఇచ్చి హోలీ రోజు తండ్రిపై దాడి చేయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి 24గంటల్లోగా నిందితులను అరెస్టు చేసి బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నట్లు CI వెల్లడించారు.

News March 16, 2025

పల్నాడు జిల్లాలో నిలకడగా చికెన్ ధరలు 

image

పల్నాడు జిల్లాలో చికెన్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. లైవ్ కోడి కేజీ రూ.95, స్కిన్‌లెస్ రూ.200లు , స్కిన్‌తో రూ.180లుగా ఉంది. నాటుకోడి రూ.500ల నుంచి రూ.750ల వరకు విక్రయిస్తున్నారు. గత వారంతో పోలిస్తే చికెన్ ధరలలో మార్పులేదు. మటన్ ధర కేజీ రూ.1,000లుగా ఉంది. 100 కోడిగుడ్లు రూ.460-480 వరకు విక్రయాలు జరుగుతున్నాయి. దీంతో చికెన్‌కు ఆదివారం డిమాండ్ కొనసాగుతోంది. 

News March 16, 2025

నేడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి

image

ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకై ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి నేడు. 1901లో మార్చి 16న మద్రాసులో గురవయ్య, మహాలక్ష్మి దంపతులకు జన్మించారు. గాంధీ బోధించిన సత్యం, అహింస మార్గాలను అనుసరిస్తూ హరిజనోద్ధరణ కోసం అహర్నిశలు శ్రమించిన మహా పురుషుడు అమరజీవి శ్రీ పొట్టిరాములు.

error: Content is protected !!