News January 25, 2025

KMR: 1892 మంది దివ్యాంగులు గుర్తింపు

image

దివ్యాంగులకు ఉచిత ఉపకరణాలు అందించడం కోసం KMR జిల్లా సంక్షేమ అధికారి, అలీం. కో హైదరాబాద్ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈ నెల 21 నుంచి 24 వరకు కామారెడ్డి జిల్లాలోని నియోజకవర్గాల వారీగా ప్రత్యేక నిర్ధారణ శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో 1892 మంది దివ్యాంగులకు ఎంపిక చేసినట్లు జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల తెలిపారు. వీరికి త్వరలో ఉపకరణాలు పంపిణీ చేయడం జరుగుతుందని ఆమె వెల్లడించారు.

Similar News

News November 23, 2025

KRM: స్కాలర్‌షిప్ NMMS పరీక్షకి 77మంది గైర్హాజరు

image

కరీంనగర్ జిల్లాలో 7 పరీక్షా కేంద్రాలల్లో NMMS ఆదివారం 9:30 నుంచి12:30 నిర్వహించినట్లు జిల్లా విద్యాధికారి మొండయ్య తెలిపారు. పరీక్షకు 1,507 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 1,430 మంది హాజరయ్యారని తెలిపారు. 7 పరీక్షా కేంద్రాలలో సిట్టింగ్ స్క్వాడ్‌లతో పాటు 02 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించబడినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలల్లో ఎలాంటి అవాంతరాలు కలుగలేదని జిల్లా విద్యాధికారి తెలిపారు.  

News November 23, 2025

సైబరాబాద్: 424 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు

image

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా 424 కేసులను నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసు నమోదు చేశారు. 300 ద్విచక్ర వాహనాలు,18 త్రీ వీలర్స్, 99 ఫోర్ వీలర్స్, 7 హెవీ వెహికిల్స్ పైన కేసు నమోదైంది. ప్రతివారం ఈ తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.

News November 23, 2025

జిల్లాస్థాయి చెకుముఖి పోటీల్లో గర్భాం ఏపీ మోడల్ విద్యార్థులు

image

విజయనగరం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా స్థాయి చెకుముఖి పోటీలు జరిగాయి. గర్భాం ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు ఈ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచారు. వచ్చె నెల 12,13,14 తేదీల్లో కాకినాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో సైన్స్ ఎక్స్పో లో పాల్గొంటారని ప్రిన్సిపల్ అరుణ తెలిపారు. విద్యార్థులకు జనవిజ్ఞాన వేదిక మెరకముడిదాం మండల శాఖ ఇన్‌ఛార్జి ఎం.రఘునాథరాజు, నవీన్ అభినందించారు.