News December 17, 2024
KMR: 229 సైబర్ కేసుల్లోని రూ. 33,14,895 నగదు ఇప్పించాం:SP
ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లాలో సైబర్ బాధితులు పోగొట్టుకున్న 229 కేసుల్లోని రూ. 33,14,895 నగదును తిరిగి అప్పగించినట్లు జిల్లా SP సింధూ శర్మ తెలిపారు. గత జూన్, సెప్టెంబర్ తో పాటు శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమాల్లో బాధితులు తిరిగి పొందే విధముగా కోర్ట్ ద్వారా వివిధ బ్యాంక్ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసినట్లు SP వివరించారు.
Similar News
News February 1, 2025
‘కాంగ్రెస్ డిఫీట్.. కేసీఆర్ రిపీట్’: జీవన్ రెడ్డి
ఈ క్షణంలో ఎన్నికలు జరిగినా ‘కాంగ్రెస్ డిఫీట్.. కేసీఆర్ రిపీట్’ అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ స్వయంగా నిర్వహించుకున్న పోల్ సర్వేలోనే తేటతెల్లమైందని ఆయన శనివారం పేర్కొన్నారు. కేసీఆర్ స్వర్ణ యుగం మళ్లీ రావాలన్నది తెలంగాణ ప్రజల హార్ట్ బీట్ అని ఆయన అభిప్రాయపడ్డారు.
News February 1, 2025
NZB: రోడ్డు ప్రమాదంలో జర్నలిస్టు మృతి
నిజామాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ జర్నలిస్టు మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. నగరానికి చెందిన మహిపాల్ ఓ టీవీ ఛానల్‌లో కెమెరామ్యాన్ పనిచేస్తున్నాడు. రాత్రి ఎడపల్లి మండలం ఠానాకాలన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా జానకంపేట అలీసాగర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన మహిపాల్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
News February 1, 2025
నిజామాబాద్ జిల్లా వెదర్ అప్డేట్@8AM
నిజామాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. అత్యల్పంగా పోతంగల్లో 17℃, నిజామాబాద్ 17.1, మోస్రా 17.2, జకోరా 17.3, మోర్తాడ్ 17.4, యడపల్లి 17.5, సాలూరా 17.6, పల్డా, మల్లాపూర్ 17.7, గోపన్నపల్లి, ఏర్గట్ల, జానకంపేట్ 17.8, చందూర్ 17.9, మెండోరా, కొటగిరి, చిన్న మవంది, డిచ్‌పల్లి, చకొండూరు, కల్లూరి 18, లక్స్మాపూర్, బెల్లాల్, గన్నారం, నిజామాబాద్ పట్టణంలో 18.1℃గా నమోదయ్యాయి.