News April 4, 2025
KMR: 3 నెలల్లో 136 రోడ్డు ప్రమాదాలు

ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు కేవలం 3 నెలల వ్యవధిలోనే కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 136 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ప్రాణాంతకమైన ప్రమాదాల్లో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. 17 మంది గాయపడ్డారు. ప్రాణాంతకం కానీ ప్రమాదాల్లో..105 మంది గాయపడ్డారు. మరో 7 మందికి ఎలాంటి గాయాలు కాలేదు. జిల్లా పోలీసు శాఖ గురువారం విడుదల చేసిన నివేదికలో పై వివరాలు వెల్లడయ్యాయి.
Similar News
News April 8, 2025
తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది: సీతక్క

ములుగు జిల్లాలో కురిసిన వర్షానికి పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి అందించాలని కలెక్టర్ దివాకర టీఎస్‌ను మంత్రి సీతక్క ఆదేశించారు. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. మండలాల వారీగా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేయాలని, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధికారులతో పర్యటించి రైతులకు అండగా ఉండాలన్నారు.
News April 8, 2025
జంట పేలుళ్ల కేసు.. హైకోర్టు సంచలన తీర్పు

TG: దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో HC సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష విధించింది. దోషులు తహసీన్ అక్తర్, భక్తల్, అజాబ్, అసుదుల్లా అక్తర్, రెహ్మాన్‌కు గతంలో NIA కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడం సరైనదేనని పేర్కొంది. 2013లో జరిగిన వరుస పేలుళ్ల ఘటనలో 18 మంది మరణించగా 131 మంది గాయపడ్డారు. కాగా ఈ దాడుల ప్రధాన సూత్రధారుడు రియాజ్ భత్కల్ ఇంకా పరారీలోనే ఉన్నాడు.
News April 8, 2025
విశాఖలో ఏడేళ్ల బాలుడి మృతి

విశాఖ విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్‌లో రిషి(7) మృతి చెందాడు. గుట్టు చప్పుడు కాకుండా బైక్‌పై ప్రైవేట్ ఆసుపత్రికి స్పోర్ట్స్ క్లబ్ సిబ్బంది తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రికి వెళ్లగా అప్పటికే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు నిర్దారించారు. పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించగా.. బంధువులు ఆందోళనకు దిగినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.