News October 28, 2025

KMR: 49 షాపుల్లో 12 వైన్సులు మహిళలకే!

image

కామారెడ్డి జిల్లాలో 49 మద్యం దుకాణాల కేటాయింపునకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమక్షంలో సోమవారం లక్కీ డ్రా నిర్వహించారు. ఈ లాటరీ ప్రక్రియలో మొత్తం 49 మంది అదృష్టవంతులు వైన్ షాపు లైసెన్స్‌లను దక్కించుకోగా, ఇందులో మహిళా శక్తి తన సత్తా చాటింది. మొత్తం విజేతల్లో ఏకంగా 12 మంది మహిళలు వైన్ షాపు లైసెన్స్‌లను గెలుచుకోవడం విశేషం.

Similar News

News October 28, 2025

శ్రీకాకుళం జిల్లా మీదుగా నడిచే 20 రైళ్లు రద్దు

image

తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా మీదుగా నడిచే 20 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్టు రైల్వే జీఎం పరమేశ్వర ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రయాణికుల భద్రత మేరకు అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో రైళ్ల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులను సూచించారు.

News October 28, 2025

భారీ వర్షాలు.. జిల్లాలో కంట్రోల్ రూం ఫోన్ నంబర్లు ఇవే.!

image

☞ నెల్లూరు కలెక్టరేట్: 086102331261, 7995576699
☞ కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయం-7601002776
☞ నెల్లూరు RDO ఆఫీసు- 9849904061
☞ ఆత్మకూరు RDO ఆఫీసు- 9100948215
☞ కావలి RDO ఆఫీసు-7702267559
☞ రాష్ట్ర టోల్‌ఫ్రీ నంబర్లు 112, 1070, 1800-425-0101.
☞ జిల్లా యాంత్రాంగం తుఫాన్ ధాటికి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంది.

News October 28, 2025

తణుకు: ఇద్దరు డీఎస్పీలు ఒక్కటయ్యారు

image

ప.గో జిల్లా తణుకులో ఇద్దరు DSPల వివాహ మహోత్సవం జరిగింది. గతంలో చందోలు PSలో ట్రైనింగ్‌ డీఎస్పీగా విధులు నిర్వహించి, ప్రస్తుతం కృష్ణా జిల్లా అవనిగడ్డ డీఎస్పీగా పనిచేస్తున్న విద్యశ్రీ(స్వగ్రామం ప.గో(D) పాలంగి), పల్నాడు జిల్లా గురజాల డీఎస్పీగా పనిచేస్తున్న జగదీష్ వివాహ వేడుక ఆదివారం రాత్రి కన్నుల పండుగగా జరిగింది. పోలీసు శాఖలో ఒకే క్యాడర్‌లో ఉన్న అధికారులు ప్రేమ వివాహం చేసుకోవడం విశేషం.