News February 4, 2025
KMR: 59 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు: కలెక్టర్

పట్ట భద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో 54 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఫిబ్రవరి 27న ఎన్నికలు జరుగుతాయని, మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఆయన పేర్కోన్నారు. 16417 పట్టభద్రుల, 2125 ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నాట్లు వివరించారు. ఓటర్లను ప్రభావితం చేయకూడదని సూచించారు.
Similar News
News February 10, 2026
గుత్తి మీదుగా కాచిగూడ–తిరుపతి ప్రత్యేక రైలు

ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు రైల్వే డివిజన్ పరిధిలో గుత్తి మీదుగా కాచిగూడ–తిరుపతి ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాచిగూడ–తిరుపతి (07511) సింగిల్ ట్రిప్ ప్రత్యేక రైలు ఈనెల 12న కాచిగూడ నుంచి మధ్యాహ్నం 3.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 3.45 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ రైలు షాద్‌నగర్, మహబూబ్‌నగర్, కర్నూలు, గుత్తి, తాడిపత్రి, కడప తదితర స్టేషన్లలో ఆగుతుంది.
News February 10, 2026
సంగారెడ్డి: మున్సిపోల్.. ప్రలోభాల పర్వం !

ఉమ్మడి జిల్లాలో 19 మున్సిపాలిటీల్లో మున్సిపల్ పోలింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ప్రచారం ముగియడంతో ప్రలోభాలకు తెరలేపారు. ప్రత్యర్థి అభ్యర్థులను ఓడించటమే లక్ష్యంగా ఓటర్లకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రలోభపెట్టే పనుల్లో నిమగ్నమయ్యారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు భారీగా మద్యం, డబ్బులు పంచుతున్నారు. HYD నగర శివారు మున్సిపాలిటీలు, పెద్ద పట్టణాల్లో ఓటుకు రూ.5 నుంచి 10వేల వరకు ఇస్తున్నట్లు సమాచారం.
News February 10, 2026
HYD: HCUలో కిటికీ గ్రిల్ తొలగించి ల్యాప్ టాప్ ల చోరీ

HCUలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కిటికీ గ్రిల్ తొలగించి క్లాస్ రూమ్‌లోకి చొరబడి 50 ల్యాప్ టాప్ లను చోరీ చేశారు. భవనంలోని వెనక కిటీకీ గ్రిల్ తొలగించడం, కారు టైర్ల గుర్తులను పోలీసులు గుర్తించారు. యూనివర్సిటీ నలుమూలల ఉన్న సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఘటనపై గచ్చిబౌలి PSలో ఫిర్యాదు చేయగా..కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ బాలరాజు తెలిపారు.


