News February 4, 2025
KMR: 59 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు: కలెక్టర్

పట్ట భద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో 54 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఫిబ్రవరి 27న ఎన్నికలు జరుగుతాయని, మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఆయన పేర్కోన్నారు. 16417 పట్టభద్రుల, 2125 ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నాట్లు వివరించారు. ఓటర్లను ప్రభావితం చేయకూడదని సూచించారు.
Similar News
News March 13, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

మార్చి 13, గురువారం
ఫజర్: తెల్లవారుజామున 5.14 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.26 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.26 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.26 గంటలకు
ఇష: రాత్రి 7.38 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 13, 2025
వరంగల్ మార్కెట్లో మిర్చి ఉత్పత్తుల ధరలు ఇలా.!

వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో అరుదైన మిర్చి ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. దీపిక మిర్చి క్వింటాకి రూ.16,500 పలకగా, 5531 రకం మిర్చికి రూ. 11,000 ధర వచ్చింది. అలాగే 1048 మిర్చికి రూ.11 వేలు, టమాటా మిర్చికి రూ.32వేలు, సింగిల్ పట్టి మిర్చికి రూ.37000 ధర వచ్చినట్లు వ్యాపారులు పేర్కొన్నారు.
News March 13, 2025
TRAIN HIJACK: బందీలు విడుదల

పాకిస్థాన్ ట్రైన్ హైజాక్‌లో బందీలందరినీ సైన్యం విడిపించింది. 346 మందిని విడిపించినట్లు ప్రకటనలో పేర్కొంది. మొత్తం 33 మంది టెర్రరిస్టులను హతమార్చినట్లు తెలిపింది. ఈ క్రమంలో 28 మంది పాక్ జవాన్లు, బందీల్లో 21 మంది చనిపోయినట్లు వెల్లడించింది.