News March 31, 2025

KMR: BC, SC, ST JAC ఏర్పాటు

image

సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘తెలంగాణలో సామాజిక న్యాయం కోసం BC, SC, ST రాజ్యాధికార JAC నూతన వేదిక ఏర్పాటు’ కార్యక్రమంలో DSP కామారెడ్డి జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఆంధ్ర అగ్రవర్ణాల కన్నా తెలంగాణలో ఉన్న అగ్రవర్ణాల చేతిలోనే బహుజన సమాజం ఎక్కువగా మోసపోయిందన్నారు. అందుకే అగ్రకులాల కబంధహస్తాల నుంచి అణగారిన వర్గాల ప్రజలను విడిపించి స్వతంత్రులను చేయడానికే JAC ఏర్పటు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News April 23, 2025

చంద్రమౌళి మృతదేహానికి సీఎం నివాళి

image

ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జేఎస్ చంద్రమౌళి మృతదేహానికి సీఎం చంద్రబాబు శ్రద్ధాంజలి ఘటించారు. ముందుగా పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యలను ఓదార్చి ధైర్యం చెప్పారు. సీఎంతో పాటు ఎమ్మెల్యే గణబాబు, విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ చిరంజీవి, పలువురు కూటమి నాయకులు ఉన్నారు.

News April 23, 2025

పల్నాడు జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ జిల్లాలో టెన్త్ టాపర్స్‌ను అభినందించిన కలెక్టర్ ☞ అమరావతిలో ఉగ్ర దాడిని నిరసిస్తూ క్యాండిల్ ర్యాలీ ☞ పిడుగురాళ్లలో సందడి చేసిన హీరోయిన్ మెహరీన్ ☞ సత్తనపల్లిలో పోలీసుల తనిఖీలు ☞ నకరికల్లు పోలీస్ స్టేషను తనిఖీ చేసిన ఎస్పీ ☞ పెద్దకూరపాడులో యువకుడిపై దాడి

News April 23, 2025

చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా

image

ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించారు. టీ20ల్లో అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్‌గా ఆయన అవతరించారు. హైదరాబాద్‌తో మ్యాచులో బుమ్రా ఈ ఫీట్ నెలకొల్పారు. 237 ఇన్నింగ్సుల్లో ఆయన ఈ ఘనత సాధించారు. ఓవరాల్‌గా అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్‌గా జస్ప్రీత్ నిలిచారు. అగ్ర స్థానంలో ఆండ్రూ టై ఉన్నారు. అతడు 208 మ్యాచుల్లోనే 300 వికెట్ల మార్కును అందుకున్నారు.

error: Content is protected !!