News March 31, 2025
KMR: BC, SC, ST JAC ఏర్పాటు

సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘తెలంగాణలో సామాజిక న్యాయం కోసం BC, SC, ST రాజ్యాధికార JAC నూతన వేదిక ఏర్పాటు’ కార్యక్రమంలో DSP కామారెడ్డి జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఆంధ్ర అగ్రవర్ణాల కన్నా తెలంగాణలో ఉన్న అగ్రవర్ణాల చేతిలోనే బహుజన సమాజం ఎక్కువగా మోసపోయిందన్నారు. అందుకే అగ్రకులాల కబంధహస్తాల నుంచి అణగారిన వర్గాల ప్రజలను విడిపించి స్వతంత్రులను చేయడానికే JAC ఏర్పటు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News April 2, 2025
ఏపీలో 3 రోజులపాటు తేలికపాటి వర్షాలు

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఇవాళ సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో చెదురుమదురు వానలు పడతాయని తెలిపింది. అలాగే గురువారం రాయలసీమ, అల్లూరి జిల్లాలోని కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శుక్రవారం ఉత్తరాంధ్ర, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
News April 2, 2025
చినగంజాం మండలంలో షిప్ బిల్డింగ్: CM

పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి అభ్యర్థన మేరకు చినగంజాం మండలంలో షిప్ బిల్డింగ్, షిప్ రిపేరింగ్ ఇండస్ట్రీ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే చినగంజాంలో వ్యవసాయ మార్కెట్ యార్డుకు కృషి చేస్తామన్నారు. కొమ్ముమూరి కాలువ ఆధునికీకరణ, మండలంలో డిగ్రీ కళాశాల నిర్మాణం, మినీ స్టేడియం, మోటుపల్లి నుంచి కారిడార్ నిర్మాణానికి సీఎంకు ఎమ్మెల్యే విన్నవించారు.
News April 2, 2025
గిబ్లీ ట్రెండ్‌లోకి పుట్టపర్తి ఎమ్మెల్యే

సోషల్ మీడియాలో గిబ్లీ స్టైల్ ఫొటోలు వైరల్‌గా మారాయి. ChatGPT ప్రవేశపెట్టిన గిబ్లీ ఫీచర్ ఉచితంగా అందుబాటులోకి రావడంతో అందరూ తెగ వాడేస్తున్నారు. ప్రముఖులూ తమ ఫొటోలను యానిమే స్టైల్‌లోకి మార్చుకుంటున్నారు. తాజాగా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సీఎం చంద్రబాబుతో ఉన్న ఫొటోను గిబ్లీ స్టైల్‌లోకి మార్చి సోషల్ మీడియాలో షేర్ చేశారు.