News March 27, 2025

KMR: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

image

TG కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం నిజామాబాద్, కామారెడ్డి డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని అడిగారు. జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై చర్చించారు. కాంగ్రెస్ పై BRSచేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని చెప్పినట్లు సమాచారం. కాగా నేడు డీసీసీలతో ఢిల్లీలో అధిష్ఠానం సమావేశం కానుంది.

Similar News

News November 15, 2025

ఇంద్రకీలాద్రిపై స్వచ్ఛాంద్ర కార్యక్రమం

image

ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం స్వచ్ఛాంద్ర కార్యక్రమం జరిగింది. ఆలయ సిబ్బంది, అధికారులు పరిశుభ్రతపై ప్రమాణ స్వీకారం చేశారు. నూతన రాజగోపురం ప్రాంగణంలో ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈఓ శీనా నాయక్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ధర్మకర్తల సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, శానిటేషన్, వైద్య, భద్రతా విభాగ సిబ్బంది పాల్గొన్నారు.

News November 15, 2025

మిర్యాలగూడలో వ్యభిచారంపై దాడి.. నలుగురు అరెస్ట్

image

మిర్యాలగూడలో వ్యభిచార గృహంపై వన్ టౌన్ పోలీసులు శుక్రవారం దాడి చేసి నలుగురిని అరెస్టు చేశారు. ఎస్సై సైదిరెడ్డి వివరాల ప్రకారం.. రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న షేక్ ఫాతిమా, రెడ్డబోయిన సంధ్య వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం అందింది. దాడి చేసి నిర్వాహకులతో పాటు ఒక మహిళ, విటుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.

News November 15, 2025

అతి వేగం ప్రమాదకరం: వరంగల్ ట్రాఫిక్ పోలీస్

image

థ్రిల్‌ కోసం వేగం పెంచి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని వరంగల్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు సూచించారు. రోడ్లు ఖాళీగా ఉన్నాయని స్పీడ్‌గా వెళ్లి ప్రమాదాలను స్వాగతించవద్దని వారు కోరారు. తమ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ఇతరులను ఇబ్బంది పెట్టొద్దని, కుటుంబ సభ్యుల కోసమైనా సురక్షితంగా గమ్యం చేరుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.