News March 27, 2025
KMR: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

TG కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం నిజామాబాద్, కామారెడ్డి డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని అడిగారు. జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై చర్చించారు. కాంగ్రెస్ పై BRSచేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని చెప్పినట్లు సమాచారం. కాగా నేడు డీసీసీలతో ఢిల్లీలో అధిష్ఠానం సమావేశం కానుంది.
Similar News
News April 25, 2025
అన్నమయ్య: పది పరీక్షలో ఫెయిల్.. ఇద్దరు విద్యార్థులు మృతి

అన్నమయ్య జిల్లాలో రెండు విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. పది పరీక్షలో పెయిల్ అయ్యానని ములకలచెరువు మండలం పెద్దమోరవ పల్లికి చెందిన నవనీ (15) గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. అలాగే గుర్రంకొండకు చెందిన విష్ణు వరుసగా మూడు సార్లు పది పరీక్షలు రాశాడు. అయినా ఫెయిల్ అవుతుండటంతో మనస్థాపానికి గురై బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు ఘటనలతో అన్నమయ్య జిల్లా ఉలిక్కి పడింది.
News April 25, 2025
సిక్కింలో వరదలు.. చిక్కుకున్న 1000మంది టూరిస్టులు

సిక్కింను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో రహదార్లు మూసుకుపోయి 1000మంది పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయారు. కొండచరియల కారణంగా మున్షితాంగ్, లాచుంగ్ చుంగ్‌తాంగ్ రోడ్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయని అధికారులు తెలిపారు. విపత్తు నిర్వహణ బలగాలు సహాయక చర్యలు చేపట్టాయని పేర్కొన్నారు.
News April 25, 2025
జగిత్యాల: ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య

ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన JGTL పట్టణంలో జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యుల ప్రకారం.. JGTL(D) పోచమ్మ వాడకు చెందిన సాప్ట్ వేర్ ఉద్యోగి ప్రసన్నలక్ష్మి(28), వెల్గటూర్(M)రాంనుర్‌కు చెందిన గాంధారి తిరుపతికి 2023లో వివాహమైంది. వీరికి సంవత్సరం బాబు ఉన్నాడు. కొన్నిరోజుల క్రితం పుట్టింటికి వచ్చిన ఆమె గురువారం ఇంట్లో ‘సారీ నాన్న.. నాకు బతకాలని లేదు’ అని అద్దంపై రాసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.