News December 30, 2024
KMR: DEC 31st.. రూల్స్ మస్ట్: ఎస్పీ
ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో నిబంధనలు పాటిస్తూ..న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని జిల్లా SP సింధు శర్మ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దని సూచించారు. రోడ్లపై కేక్ కట్టింగ్, అల్లర్లకు పాల్పడడం వంటి కార్యక్రమాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. డీజేలు వినియోగిస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆరోజు రాత్రి బృందాలుగా పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు.
Similar News
News January 7, 2025
నేడు కామారెడ్డికి మంత్రి జూపల్లి
నేడు కామారెడ్డిలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నట్లు కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు తెలిపారు. కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకారానికి మంత్రి హాజరవుతున్నారని పేర్కొన్నారు. మంత్రితో పాటు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొంటారని ఆయన వెల్లడించారు.
News January 6, 2025
NZB: సినిమా ట్రైలర్ రిలీజ్.. ట్రాఫిక్ కష్టాలు
నిజామాబాద్ నగరంలో సోమవారం రాత్రి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ట్రైలర్ ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం రోడ్లు బ్లాక్ చేయడంతో ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. పాత కలెక్టరేట్ వద్ద ఈవెంట్ నిర్వహించగా పోలీసులు కోర్టు చౌరస్తా నుంచి సీపీ క్యాంపు ఆఫీస్ మీదుగా బస్ స్టాండ్ వైపుకు వెళ్లే రహదారిని మూసివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
News January 6, 2025
NZB: ఉమ్మడి జిల్లాలో కాస్త తగ్గిన చలి తీవ్రత
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కొంత పెరిగి చలి తీవ్రత కాస్త తగ్గింది. కామారెడ్డి జిల్లాలో అత్యల్పంగా గాంధారి 10.0, జుక్కల్ 10.7, రామలక్ష్మణపల్లి 10.9, డోంగ్లి 11.7, లింగంపేట, వేల్పుగొండ 11.9 నమోదు కాగా నిజామాబాద్ జిల్లాలో అత్యల్పంగా నిజామాబాద్ సౌత్ 12.9, మెండోరా 13.0, వలిపూర్ 13.2,ఎర్గట్ల 13.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.