News March 17, 2024
KMR: జోరుగా వర్షం.. అత్యధికంగా ఇక్కడే..
జిల్లాలో నిన్న జోరుగా వర్షం కురిసింది. అత్యధికంగా కామారెడ్డి మం. పాత రాజంపేట్ లో 34.0 మి.మీ, వర్షపాతం నమోదైంది. ఇక.. బీర్కూర్ 21.0 మి.మీ, నస్రుల్లాబాద్ 18.5 మి.మీ, నస్రుల్లాబాద్ (మం) బొమ్మందేవ్ పల్లి 15.5 మి.మీ, గాంధారి (మం) రామలక్ష్మణ్ పల్లి 11.0 మి.మీ, మచారెడ్డి (మం) లచ్చంపేట 10.8 మి.మీ, పిట్లం 7.3 మి.మీ, మద్నూర్ (మం) మెనూర్ 7.0 మి.మీ,బిచ్కుంద (మం) పుల్కల్ 6.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
Similar News
News October 30, 2024
ఎల్లారెడ్డి: ‘డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలి’
ఎల్లారెడ్డి నియోజకవర్గానికి నాలుగువేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు కోరారు. ఆయన ఈ విషయంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి అధికారికంగా లేఖ రాశారు. రాష్ట్రంలో అత్యధిక వెనుకబడిన నియోజకవర్గం ఎల్లారెడ్డి అని ఆయన తెలిపారు. ఇల్లు లేని నిరుపేదలు ఎంతోమంది ఉన్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు.
News October 30, 2024
కామారెడ్డి: బదిలీపై వెళ్లిన రెండు రోజులకే విషాదం
బదిలీ అయ్యి పాఠశాలలో విద్యార్థులకు పరిచయం కాకముందే ఉపాధ్యాయుడిని విధి కాటేసింది. ఈఘటన నాగిరెడ్డిపేట మండలం మాసానిపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన వరిగే నర్సింలు కుమారుడు యాదగిరికి రెండు ఉద్యోగాలు రాగా, లింగంపేట్ బాలుర ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయునిగా విధుల్లో చేరాడు. రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు.
News October 30, 2024
కామారెడ్డి: ‘నవంబర్ 9, 10వ తేదీల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు’
నవంబర్ 9, 10 వ తేదీల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ తెలిపారు. జనవరి 1, 2025 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులు కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ఆన్లైన్ ద్వారా కొత్త ఓటర్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. గ్రామాల్లోని బిఎల్ఓ లకు ఆఫ్ లైన్ ద్వారా అర్హత గల యువతీ యువకులు దరఖాస్తులు చేసుకోవచ్చును.