News April 3, 2025

KMR: KCRతో జిల్లా మాజీ ఎమ్మెల్యేలు

image

బీఆర్ఎస్ త్వరలో నిర్వహించనున్న రజతోత్సవ ఏర్పాట్ల నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల నేతలు ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో బుధవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కామారెడ్డి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జాజుల సురేందర్, గంప గోవర్ధన్, జిల్లా పార్టీ అధ్యక్షుడు ముజీబుద్దీన్ పాల్గొన్నారు.

Similar News

News October 17, 2025

లోకేశ్‌ ట్వీట్‌కు కౌంటరిచ్చిన సిద్దరామయ్య

image

APలో పెట్టుబడులపై మంత్రి లోకేశ్ చేసిన <<18020050>>ట్వీట్‌<<>> తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోంది. తాజాగా కర్ణాటక CM సిద్దరామయ్య కౌంటరిచ్చారు. ‘ఇన్వెస్టర్లు తమకు నచ్చిన చోట పెట్టుబడులు పెడతారు. యాపిల్ సంస్థ కర్ణాటకలో ఇన్వెస్ట్ చేసింది.. ఆంధ్రప్రదేశ్‌లో కాదు’ అని వ్యాఖ్యానించారు. అంతకుముందు లోకేశ్‌ను ఎద్దేవా చేస్తూ కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గేతో పాటు KN, TN నెటిజన్లు <<18027162>>ట్వీట్లు<<>> చేశారు.

News October 17, 2025

కోదాడ: బీసీల బంద్‌కు ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు

image

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ ఐకాస ఆధ్వర్యంలో రేపు తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దక్షిణ తెలంగాణ జిల్లాల అధ్యక్షుడు చింతాబాబు మాదిగ శుక్రవారం కోదాడలో ఈ విషయాన్ని వెల్లడించారు. మాదిగలు, అనుబంధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

News October 17, 2025

ఏలూరు: శానిటేషన్‌పై అధికారుల పనితీరుపై కలెక్టర్ అసహనం

image

జిల్లాలో నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లోని శానిటేషన్‌పై కలెక్టర్ వెట్రిసెల్వి శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా శానిటేషన్ ప్రగతిని సమీక్షిస్తూ, పనితీరులో లోటు ఉన్న మండల అధికారులపై కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా శానిటేషన్‌ను మెరుగుపరచాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.