News January 17, 2026
KMR, NZB జిల్లాలో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటే?

కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని వివిధ మార్కెట్లలో కూరగాయల ధరల వివరాలు ఇలా ఉన్నాయి.(కేజీలలో): టమాట-రూ.30/-, వంకాయలు-50/-, బెండకాయలు-80/-, పచ్చిమిర్చి-60/-, కాకరకాయలు-60/-, బీరకాయలు-80/-, చిక్కుడుకాయ -80/-,దోసకాయలు-50/-, ఆలుగడ్డ-40/-, ఉల్లిగడ్డలు-50/-, క్యాబేజి-50/-, క్యారెట్-50/-, కాలిఫ్లవర్-60/- క్యాప్సికం-50/-, దొండకాయలు-60/-, పాలకూర-60/-, తోటకూర-రూ.60/- ధరలు పలుకుతున్నాయి.
Similar News
News January 30, 2026
ప్రతి బిడ్డ చదువుకోవాలి: జిల్లా కలెక్టర్

ఖమ్మం నగరంలో నిర్వహిస్తున్న ‘ప్రతి బిడ్డ చదువుతుంది’ కార్యక్రమంపై గురువారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ శ్రీజ, జిల్లా విద్యాశాఖ అధికారిణి (DEO) చైతన్య జైనీతో కలిసి అన్ని మండల విద్యాధికారులు (MEO), ప్రధానోపాధ్యాయులతో (HM) ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాల వయస్సున్న ప్రతి బిడ్డను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు.
News January 30, 2026
విమాన ప్రమాదం.. పైలట్ ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో..

మహారాష్ట్ర Dy.CM <<18990751>>అజిత్ పవార్<<>> విమాన ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ ఫ్లైట్ నడిపిన కెప్టెన్ సుమిత్ కపూర్ వేరే పైలట్ స్థానంలో వచ్చినట్లు అతని ఫ్రెండ్స్ తెలిపారు. ‘కొన్ని రోజుల క్రితమే సుమిత్ హాంగ్‌కాంగ్ నుంచి వచ్చారు. పవార్‌ను బారామతి తీసుకెళ్లాల్సిన పైలట్ ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో కొన్ని గంటల ముందే సుమిత్‌కు ఆ బాధ్యత అప్పగించారు’ అని పేర్కొన్నారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.
News January 30, 2026
కర్నూలు జిల్లాలో 10,500 మంది విద్యార్థుల వలసలు

కర్నూలు జిల్లాలో 10,500 మంది విద్యార్థులు వలస వెళ్లడం జిల్లా అధికారుల నిర్లక్ష్య ఫలితమని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రంగప్ప విమర్శించారు. కర్నూలులో ఆయన మాట్లాడారు. వలసలు అధికంగా ఉన్న జిల్లాగా పేరున్నా ముందస్తు చర్యలు తీసుకోలేదన్నారు. సరైన హాస్టళ్లు, భోజనం, విద్యా సౌకర్యాలు ఉంటే విద్యార్థులు తల్లిదండ్రులతో వలస వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదే కాదన్నారు. ఇప్పటికే 9,000 మందిని తిరిగి రప్పించామని తెలిపారు.


