News February 1, 2025
KMR: POS యంత్రాల ద్వారా ఋణాలు వసూలు చేయాలి: కలెక్టర్

స్త్రీ నిధి ఋణాలు POS మిషన్స్ ద్వారా వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో POS మిషన్లను సమాఖ్య ప్రతినిధులకు కలెక్టర్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్త్రీ నిధికి సంబంధించిన ఋణాలు బ్యాంకులకు వెళ్లకుండా POS యంత్రాల ద్వారా చెల్లించవచ్చన్నారు. మెప్మా పథక సంచాలకులు శ్రీధర్ రెడ్డి, రీజినల్ మేనేజర్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు.
Similar News
News November 5, 2025
APPLY NOW : PGIMERలో ఉద్యోగాలు

చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(<
News November 5, 2025
చలికాలంలో జుట్టూడకుండా ఉండాలంటే..

మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలంలో జుట్టు సమస్యలు ఎక్కువ. కాబట్టి జుట్టు సంరక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. తలస్నానానికి గోరువెచ్చటి నీటినే వాడాలి. తర్వాత కండీషనర్ మర్చిపోకూడదు. జుట్టు త్వరగా ఆరడానికి బ్లో డ్రైయ్యర్స్ వాడటం తగ్గించాలని సూచిస్తున్నారు. ఈ సీజన్లో వెంట్రుకలకు ఎంత తరచుగా ఆయిల్ పెడితే అంత మంచిది. తేమ శాతం నిలిచి జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుందంటున్నారు.
News November 5, 2025
యూట్యూబర్‌పై క్రిమినల్ కేసు నమోదు

AP 175 న్యూస్ యూట్యూబర్ M.శ్రీనివాసరావుపై కందుకూరులో క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు CI అన్వర్ బాషా తెలిపారు. AP175 న్యూస్, గుండుసూది పేర్లతో శ్రీనివాసరావు సంచలనాత్మక కథనాలను యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తుంటారు. కందుకూరు MLA ఇంటూరిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఆయన ఇటీవల వీడియోలు పోస్ట్ చేశారు. కొందరితో కుట్ర చేసి MLA పరువుకు భంగం కలిగేలా శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా పోస్ట్ చేస్తున్నారని కేసు నమోదైంది.


