News July 5, 2025
KMR: SC, STల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి: బక్కి వెంకటయ్య

గ్రామాల్లో (సివిల్ రైట్స్ డే) కార్యక్రమాన్ని గ్రామాల్లో నిర్వహించి, ఎస్సీ, ఎస్టీల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి కోసం రూపొందించిన చట్టాలు, సంక్షేమ పథకాల గురించి సంపూర్ణ అవగాహన కల్పించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీల భూమి, అట్రాసిటీ కేసులపై సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ఆయన పలు సూచనలు చేశారు.
Similar News
News July 6, 2025
జడ్జీలకు హైకోర్టు కీలక ఆదేశాలు

AP: సోషల్ మీడియా కేసుల్లో రాష్ట్రంలోని జడ్జీలందరికీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ‘SM పోస్టుల కేసుల్లో ఆర్నేష్ కుమార్ Vs స్టేట్ ఆఫ్ బీహార్ కేసు తీర్పులో సుప్రీం నిర్దేశించిన సూత్రాలు పాటించడంలేదు. ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యక్తీకరణ(3-ఏడేళ్లలోపు శిక్షపడే కేసుల్లో)పై FIRలు నమోదుకు ముందు కచ్చితంగా విచారణ జరగాలి. 14 రోజుల్లోగా విచారణ చేయాలి, అందుకు DSP అనుమతి పొందాలి’ అని స్పష్టం చేసింది.
News July 6, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (జులై 6, ఆదివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.26 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.47 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.21 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.57 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.55 గంటలకు
✒ ఇష: రాత్రి 8.16 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News July 6, 2025
నేటి నుంచే రొట్టెల పండుగ.. షెడ్యూల్ ఇదే.!

➠ జులై 6వ తేదీ రాత్రి సందల్ మాలి
➠ 7వ తేదీ రాత్రి గంధం మహాత్సవం
➠ 8వ తేదీ రొట్టెల పండుగ
➠ 9వ తేదీ తహలీల్ ఫాతేహ
➠ 10వ తేదీ ముగింపు వేడుకలు
ఈ మేరకు ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు నెల్లూరుకు తరలి వస్తున్నారు.