News April 21, 2025
KMR: TGSRTCలో జాబ్స్.. ప్రిపరేషన్‌కు READY

TGSRTCలో 3,038 పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రకటించడంతో కామారెడ్డిలో నిరుద్యోగులు ప్రిపరేషన్‌కు రెడీ అవుతున్నారు. డ్రైవర్లు-2,000, శ్రామిక్-743, డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానికల్-114, ట్రాఫిక్- 84), DM/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ -25,అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్-18,సివిల్-23, సెక్షన్ ఆఫీసర్-11, అకౌంట్స్ ఆఫీసర్-6,మెడికల్ ఆఫీసర్స్ (జనరల్-7, స్పెషలిస్టు-7) పోస్టులు ఉన్నాయి.
Similar News
News April 21, 2025
ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభం

TG: జపాన్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్‌ను ఆయనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. దీంతో భారత్ నుంచి ఈ ఎక్స్‌పోలో పాల్గొన్న తొలి రాష్ట్రంగా TG నిలిచింది. రాష్ట్ర సాంకేతిక పురోగతి, సాంస్కృతిక వారసత్వం, పర్యాటక సంపదను ప్రతిబింబించే ప్రదర్శనలు ఇక్కడ ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంపై రేవంత్ బృందం దృష్టి సారించింది.
News April 21, 2025
వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

AP: YCP నేత వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. భూ అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో బెయిల్ ఇవ్వాలని వంశీ ఈ పిటిషన్ వేశారు. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించిన న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. అటు లిక్కర్ స్కాం కేసులో రాజ్ కసిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని CIDని ఆదేశించిన HC, విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
News April 21, 2025
పెళ్లి చేసుకున్న ఇద్దరు హీరోయిన్లు!

అమెరికన్ నటి క్రిస్టెన్ స్టీవర్ట్, తన ప్రేయసి డైలాన్ మేయర్ పెళ్లి చేసుకున్నారు. లాస్ ఏంజెలిస్‌లోని తమ నివాసంలో అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగింది. 2013లో ఓ సినిమా సెట్‌లో వీరికి పరిచయం ఏర్పడింది. రెండేళ్ల డేటింగ్ అనంతరం 2021లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు ప్రకటించారు. ట్విలైట్ ఫ్రాంచైజీ సినిమాలతో క్రిస్టెన్ పాపులయ్యారు. డైలాన్ మేయర్ నటిగా, రచయితగా పలు సినిమాలకు పనిచేశారు.