News September 19, 2025
KMR: TLM మేళాలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన నాగరాజు

కామారెడ్డి జిల్లా FLN TLM మేళా ప్రదర్శనలో స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో SGT ఉపాధ్యాయుడు దాసరి నాగరాజు(Spl.Edu) ఉత్తమ ప్రదర్శన కనబరిచి మొదటి స్థానంలో నిలిచారు. దోమకొండ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఆయన వెనుకబడిన విద్యార్థులకు మెళుకువలు నేర్పేలా బోధనాభ్యాసన సామర్థ్యాలను తయారు చేశారు. ఈ మేరకు DEO రాజు ప్రశంసాపత్రం అందించారు.
Similar News
News September 20, 2025
PM ఆవాస్ యోజన గ్రామీణ్ సర్వేను వారం రోజుల్లో పూర్తి చేయాలి: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ సర్వేను వారం రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను శుక్రవారం ఆదేశించారు. ఇప్పటివరకు 571 గ్రామాలలో 69 శాతం సర్వే పూర్తయిందని, మిగిలిన 13,663 ఇండ్ల సర్వే త్వరగా పూర్తి చేయాలని సూచించారు. సర్వే పూర్తితో కేంద్ర నిధులు అందుతాయని, మరిన్ని ఇండ్ల నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు. సమావేశంలో ఎంపిడివోలు, అధికారులు పాల్గొన్నారు.
News September 20, 2025
మావోయిస్టు నేత జగన్ సంచలన లేఖ

మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ శుక్రవారం ఓ సంచలన లేఖను విడుదల చేశారు. మావోయిస్టు నేత సోను ఇటీవల ఆయుధాలు వీడుతామంటూ రాసిన లేఖ అనాలోచితమని, ఈ లేఖతో ఉద్యమం బలహీనపడుతుందని జగన్ పేర్కొన్నారు. ముఖ్య నాయకులతో చర్చించకుండానే సోను ఈ లేఖ రాశారని వెల్లడించారు. ఇటీవల సోను కేంద్ర ప్రభుత్వానికి, మీడియాకు లేఖ రాస్తూ చర్చలకు, సాయుధ పోరాటాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన విషయం తెలిసిందే.
News September 20, 2025
TODAY HEADLINES

* ఏపీని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతా: CM CBN
* ఈనెల 30లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించలేం: CM రేవంత్
* ఈనెల 22 నుంచి OCT 2 వరకు దసరా సెలవులు: మంత్రి లోకేశ్
* మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపేవరకు పోరాటం ఆగదు: జగన్
* ప్రజలను కాంగ్రెస్ దారుణంగా మోసం చేసింది: KTR
* టీడీపీలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు
* ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ కన్నుమూత