News February 22, 2025
KMR: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం బిక్కనూర్‌లో చోటుచేసుకుంది. మెదక్ జిల్లా గంగాపురానికి చెందిన శ్రీనివాస్ ఓ శుభకార్యం నిమిత్తం తన అత్తగారింటికి వచ్చాడు. శుక్రవారం అతిగా మద్యం సేవించి ఆరుబయట పడుకోవడంతో తెల్లవారుజామున భార్య సరిత వచ్చి నిద్రలేపిన లేవలేదు. చుట్టుపక్కల వారు వచ్చి చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Similar News
News February 23, 2025
NZB: పసుపు రైతులు ఈ విషయాన్ని గమనించాలి

మహాశివరాత్రి సందర్భంగా లేబర్ హాలిడే కారణంగా ఫిబ్రవరి 26 నుంచి 28వ తేదీ వరకు నిజామాబాద్ శ్రద్ధానంద్ గంజ్ మార్కెట్ యార్డుకు సెలవు ఉంటుందని అలాగే మార్చి 1, 2 తేదీలలో శనివారం, ఆదివారం గంజ్ తెరిచి ఉన్న పసుపుకు సంబంధించిన లావాదేవీలు ఉండవని అధికారులు తెలిపారు. తిరిగి మళ్లీ మార్చ్ 3న ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా పసుపు రైతులు ఈ విషయాన్ని గమనించాలని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
News February 23, 2025
NZB: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి: కిషన్ రెడ్డి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ ఏకమై కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన నిజామాబాద్‌లో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి.. 400 రోజులు దాటినా ఏమీ చేయలేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
News February 23, 2025
NZB: పసుపు రైతులు తేమ శాతం గమనించాలి: ఉద్యాన శాఖ

తేమ శాతం గురించి రైతులు పడే ఇబ్బంది దృష్ట్యా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పసుపు మార్కెట్ యార్డుకు అమ్మకానికి తీసుకొచ్చే రైతులు తేమ శాతం గమనించాలని నిజామాబాద్ జిల్లా ఉద్యాన శాఖ అధికారులు సూచించారు. తేమ శాతం 12 శాతం లోపు ఉన్న పసుపును మాత్రమే తీసుకురావాలని రైతులకు సూచించారు. అంతకంటే ఎక్కువ ఉంటే రైతులు ధర కోల్పోతారని ఉద్యాన శాఖ జాయింట్ డైరెక్టర్ బండారి శ్రీనివాస్ తెలిపారు.