News June 3, 2024
KMR: అన్న భూమిపట్టా మార్పిడి చేయలేదని తమ్ముడి ఆత్మహత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1717414342398-normal-WIFI.webp)
నాగిరెడ్డిపేట మండలం బెజ్గం చెరువు తండా గ్రామపంచాయతీ పరిధిలోని ఎర్రగుంట తండాకు చెందిన మలావత్ కేవుల (36) కల్లులో విషం కలుపుకొని మృతి చెందినట్లు ఎస్సై రాజు తెలిపారు. మృతుడి కేవులకు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు. పెద్దవాడైన సక్రు పైన భూమి పట్టా ఉన్నందున తన పేరు పై పట్టా మార్పిడి చేయాలని పలుమార్లు కోరాడు. అన్న సక్రు పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెంది కేవుల సూసైడ్ చేసుకున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News February 12, 2025
చిలుకూరు బాలాజీ అర్చకుడికి దాడిలలో బోధన్ యువకుడు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739269225726_71691563-normal-WIFI.webp)
హిందువులను రక్షించడానికి ఏర్పడిన రామరాజ్యం ఆర్మీ వ్యవహారంలో చిలుకూరు బాలాజీ అర్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటన వెలుగు చూసింది. ఈ రామరాజ్యం ఆర్మీలో బోధన్‌కు చెందిన సాయినాథ్ అరెస్టు వ్యవహారం చర్చనీయాంశమైంది. రంగరాజన్‌పై దాడి ఘటనలు పోలీసులు సాయినాథ్‌ను అరెస్ట్ చేశారు. జిల్లా అధ్యక్షుడిగా 2022 నుంచి పని చేస్తున్నాడు. ఇదే విషయమై ఇంకా ఎవరినైనా బెదిరించాడా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
News February 12, 2025
త్వరలో NZBలో ఎన్నికలు.. MLC ఓటు ఎలా వేయాలో తెలుసా..?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739271070044_18060220-normal-WIFI.webp)
✓ బూత్ బయట ఓటర్ లిస్టులో మీ పేరు, క్రమ సంఖ్య చూసుకోవాలి.✓ వెళ్ళేటపుడు మీ ఐడీ కార్డు తీసుకొని వెళ్ళాలి.✓ బూత్ లోపలకు వెళ్ళే ముందు మీ పేరు చూసుకుని సంతకం పెట్టాలి.✓ పోలింగ్ కేంద్రాల్లో ఇచ్చే పెన్ మాత్రమే వాడాలి.✓ మీకు ఇచ్చిన బ్యాలెట్ పేపర్ మీద అభ్యర్థుల పేర్లు, ఫోటోలు ఉంటాయి.✓ మొదట ప్రాధాన్యం ఇచ్చే వారికి ఎదురుగా ఉన్న బాక్సులో 1వ నంబర్ వేయాలి.✓ ఇతరులకు కూడా మీకు నచ్చిన ప్రాధాన్యత ఓటు వేయవచ్చు.
News February 12, 2025
NZB: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 24 మందికి జరిమానా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739274168238_51712009-normal-WIFI.webp)
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ఇద్దరు వ్యక్తులకు జైలు శిక్ష, 24 మందికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఏసీపీ నారాయణ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 26 మందికి ట్రాఫిక్ ఎస్ఐ చంద్రమోహన్ కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. 24 మందికి రూ.36,000 జరిమానా విధించి ఇద్దరికి రెండు రోజుల జైలు శిక్ష విధించారు.