News March 19, 2025

KMR: ఆత్మవిశ్వాసం ఉంటే అద్భుతాలు సాధిస్తారు: కలెక్టర్

image

దివ్యాంగ విద్యార్థులు ఆత్మ విశ్వాసంతో ఉంటే జీవితంలో అద్భుత ఫలితాలు సాధించవచ్చని KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు. సమగ్ర శిక్షా కామారెడ్డి జిల్లా, భారతీయ దివ్యాంగుల పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాలు పంపిణీ శిబిరాన్ని కలెక్టర్ బుధవారం ప్రారంభించారు. జిల్లాలో గుర్తించిన 207 మంది దివ్యాంగులకు ఉపకరణాలను ఆయన పంపిణీ చేశారు.

Similar News

News March 19, 2025

సిద్దరామయ్య ఫ్లైట్ జర్నీకి రూ.31 కోట్లు.. తీవ్ర విమర్శలు

image

రెండేళ్లలో కర్ణాటక CM సిద్దరామయ్య విమాన ప్రయాణానికి రూ.31 కోట్లు ఖర్చు చేశారు. దీనిపై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు చేస్తోంది. ఢిల్లీకి రానుపోనూ విమాన ఛార్జీ రూ.70 వేలకు మించదని, అలాంటిది ఛార్టర్ ఫ్లైట్‌లో వెళ్తూ ఒక ట్రిప్‌కే రూ.44.40 లక్షలు వృథా చేస్తున్నారని మండిపడుతోంది. రూ.10.85 లక్షలు ఖర్చు చేసి బెంగళూరు నుంచి మైసూరుకు కూడా హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నారని విమర్శిస్తోంది.

News March 19, 2025

వనపర్తి: ప్రభుత్వ వైద్య కళాశాలకు కొత్త ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్

image

వనపర్తి జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో కొత్త ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్‌గా డాక్టర్ డి.కిరణ్మయి బాధ్యతలు స్వీకరించారు. ఐడీవోసీలోని కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభిని బుధవారం ఆమె మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. డాక్టర్ కిరణ్మయి, గత మూడేళ్లుగా వనపర్తి ఎంసీహెచ్‌లో ప్రొఫెసర్ ఆఫ్ అబ్ స్టేట్రిక్స్, గైనకాలజీ నిపుణులుగా విధులు నిర్వహించారు. బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

News March 19, 2025

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలి: వనపర్తి కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికైన లబ్ధిదారులందరూ ఈ నెలాఖరులోపు ఇళ్ల నిర్మాణం ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో వెబ్ఎక్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఎంపికైన 15 గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణం ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలను ఆదేశించారు.

error: Content is protected !!