News April 3, 2025
KMR: ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల పనులను వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులకు సూచించారు. రామారెడ్డి మండలం కన్నాపూర్‌లో గురువారం కలెక్టర్ కొబ్బరి కాయ కొట్టి ఇంటి నిర్మాణం పనులను ప్రారంభించారు. అనంతరం పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డులో ఎరువుల తయారీని పరిశీలించారు. పారిశుద్ధ్య పనులను సక్రమంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News April 10, 2025
పెద్దపలి: కూతురిని చంపి తల్లి సూసైడ్

పెద్దపలి టీచర్స్ కాలనీలో <<16048255>>కూతురిని <<>>చంపి తల్లి సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాలు.. జూలపల్లి వాసి వేణుగోపాల్ రెడ్డితో KNR జిల్లా రామడుగు(M) వెదిరకు చెందిన సాహితి(26)కి పెళ్లైంది. రాత్రి వేణుగోపాల్ ఇంటికి వచ్చేసరికి కూతురు రితిన్యను చంపి భార్య ఉరేసుకుని కనిపించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 10, 2025
షిప్ యార్డ్‌లో సొసైటీ కార్మికుడి మృతి

విశాఖలో షిప్ యార్డ్‌లో సొసైటీ కార్మికుడిగా పనిచేస్తున్న అప్పారావు విద్యుత్ షాక్‌కు గురై పైనుంచి కింద పడి మృతి చెందారు. నక్కవానిపాలెం ప్రాంతానికి చెందిన పిలక అప్పారావు బుధవారం హాల్ షాప్ విభాగంలో పనిచేస్తూండగా ఈ ప్రమాదం జరిగింది. పైనుంచి కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మల్కాపురం సీఐ విద్యాసాగర్ ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు.
News April 10, 2025
కొత్తగూడెం: ‘200 ఎకరాల వ్యవసాయ భూమి కబ్జా’

కొత్తగూడెం(D) టేకులపల్లి(M) గంగారం రెవెన్యూ పరిధి సంపత్ నగర్‌లో కొందరు 200 ఎకరాల సాగు భూములకు నకిలీ పత్రాలు సృష్టించి కాజేయాలని చూస్తున్నారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. ఓ మాజీ రౌడీ షీటర్, కేటీపీఎస్‌లో పని చేసే ఒక ఉద్యోగి, స్థానికుడు ఇదంతా నడిపిస్తున్నారంటున్నారు. గుడివాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నాన్ జ్యుడీషరీ స్టాంప్ పేపర్ సృష్టించారని, ఈ ఆధారాలతో ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు.