News April 5, 2025
KMR: ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు: MLC కవిత

నీటి నిర్వహణపై అవగాహన లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని.. ఇది కాలం తెచ్చిన కరవు కాదు.. ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరువే అని ఉమ్మడి NZB జిల్లా MLC కవిత మండిపడ్డారు. ‘యాదాద్రి భువనగిరి జిల్లా టేకుల సోమారంలో పంటలకు సాగు నీరు అందక చేతికొచ్చే పంటలు ఎండిపోయాయి. పుట్టెడు దుఖంలో ఉన్న రైతులను చూస్తే గుండె బరువెక్కింది. రైతులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్‌ను వదిలిపెట్టేది లేదని’ X వేదికగా ఆమె రాసుకొచ్చారు.
Similar News
News April 7, 2025
అల్పపీడనం.. 4 రోజులు వర్షాలు

బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో పలు చోట్ల నేటి నుంచి 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో తెలంగాణలో కొన్ని చోట్ల నేటి నుంచి మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. అదే సమయంలో కొన్ని చోట్ల ఎండలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.
News April 7, 2025
ఆరు రోజుల్లో 1.27 కోట్ల మందికి సన్నబియ్యం

TG: రాష్ట్రంలో సన్నబియ్యం రేషన్ పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటివరకు 1.27 కోట్ల మంది సన్నబియ్యం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 90.42 లక్షల రేషన్ కార్డులుండగా ఏప్రిల్‌లో 42 లక్షల కార్డులపై లబ్ధిదారులు బియ్యం తీసుకున్నారు. ఈ ఆరు రోజుల్లోనే 8.75 లక్షల క్వింటాళ్ల బియ్యం సరఫరా చేశారు. పలు చోట్ల రవాణా, సాంకేతిక సమస్యలతో పంపిణీ నెమ్మదిగా సాగుతున్నా ఈ నెల 15వరకు పూర్తవుతుందని అధికారులు పేర్కొన్నారు.
News April 7, 2025
కాలువలో స్నానానికి దిగి యువకుడు గల్లంతు

రావులపాలెం మండలం గోపాలపురం బ్యాంక్ కాలవలో ఈతకోట నెక్కంటి కాలనీకి చెందిన షేక్ ఖాదర్ (21) ఆదివారం గల్లంతయ్యాడు. ఇద్దరు స్నేహితులతో కలిసి మధ్యాహ్నం గోపాలపురం ఆరుమామిళ్ల రేవు వద్దకు స్నానానికి వెళ్లాడు. ఈత కొడుతూ ఖాదర్ గల్లంతయ్యాడు. ఇద్దరు స్నేహితులు స్థానికులకు విషయం తెలిపడం తో పోలీస్, ఫైర్ సిబ్బంది సంఘటనా ప్రాంతానికి చేరుకుని స్థానికులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకు ఆచూకీ లభించలేదు.