News April 2, 2025
KMR: కలెక్టరేట్లో సర్దార్ పాపన్న గౌడ్ వర్ధంతి

కామారెడ్డి కలెక్టరేట్‌లో బుధవారం సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పుష్పాంజలి ఘటించారు. ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేసి సమాజ స్థాపన చేసిన మహనీయుడని కొనియాడారు. బీసీ సంక్షేమ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, చందర్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 4, 2025
జీలుగుమిల్లి: శోకసముద్రంలో అంజలి కుటుంబ సభ్యులు

రాజమండ్రిలో ఆత్మహత్యాయత్నం చేసిన ఉమ్మడి ప.గో(D) జీలుగుమిల్లి మండలానికి చెందిన ఫార్మసీ విద్యార్థి నల్లపు అంజలి శుక్రవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఆమె స్వగ్రామం రౌతుగూడెంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మరికాసేట్లో ఆమె భౌతికకాయాన్ని గ్రామానికి తీసుకురానున్నారు. కుమార్తె మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. అంజలి ఆత్మహత్యకి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
News April 4, 2025
GNT: బాలిక మృతి కేసు.. స్పెషల్ వైద్య బృందం దర్యాప్తు

నరసరావుపేటలో బాలిక మృతి కేసును దర్యాప్తు చేయడానికి ప్రత్యేక వైద్య బృందం గురువారం మంగళగిరి ఎయిమ్స్‌లో సమావేశమైంది. ఈ బృందంలో ఢిల్లీ, ముంబయి నుంచి వచ్చిన నిపుణులు ఉన్నారు. వారు మృత బాలిక రక్త నమూనాలపై సమగ్ర సమాచారం సేకరించారు. అనంతరం దర్యాప్తు కొనసాగించేందుకు గుంటూరు వైద్య కళాశాలకు బయలుదేరి వెళ్లారు. ఈ బృందంలో వెటర్నరీ డాక్టర్ సహా మొత్తం ఐదుగురు డాక్టర్లు ఉన్నారు.
News April 4, 2025
రైలు వాష్‌రూమ్‌లో బాలికపై లైంగిక దాడి

TG: HYD ఎంఎంటీఎస్‌లో యువతిపై అత్యాచారయత్నం ఘటన మరవకముందే.. రక్సెల్-SEC ఎక్స్‌ప్రెస్‌లో ఓ బాలిక(12)పై లైంగిక వేధింపులు కలకలం రేపాయి. ఆ రైళ్లో ప్రయాణిస్తున్న బాలిక అర్ధరాత్రి వేళ వాష్‌రూమ్‌కు వెళ్లగా, వెనకాలే ఓ వ్యక్తి అందులోకి ప్రవేశించాడు. అరగంట పాటు ఆమెను లైంగికంగా వేధించి వీడియోలు తీశారు. రైలు సికింద్రాబాద్ చేరుకోగానే బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.