News February 3, 2025

KMR: జిల్లా వాసికి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు

image

కామారెడ్డి రక్త దాతల సమూహ నిర్వాహకులు డా. బాలుకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన తలసేమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం గతేడాది కామారెడ్డి జిల్లాలో 22 రక్తదాన శిబిరాలు నిర్వహించారు. 2306 యూనిట్ల రక్తాన్ని సేకరించి రికార్డు సృష్టించారు. భారతదేశంలోనే మొట్ట మొదటి సంస్థగా ‘ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ లో చోటు దక్కించుకున్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికి డా.బాలు కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News February 3, 2025

SCRలో ఉద్యోగం.. ఈ రోజే లాస్ట్!

image

SCRలో ఉద్యోగం చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్. స్పోర్ట్స్ కోటా కింద రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. సికింద్రాబాద్‌ హెడ్ క్వార్టర్స్‌‌లో 31, సికింద్రాబాద్ డివిజన్‌లో 5, హైదరాబాద్-5, విజయవాడ-5, గుంటూరు-5 నాందేడ్-5, గుంతకల్‌‌‌లో 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత: 10th, ఇంటర్, ITI ఉత్తీర్ణత. వయస్సు: 18 నుంచి 25 మధ్య ఉండాలి. అప్లై చేసేందుకు చివరి తేదీ: ఫిబ్రవరి 03, 2025.
SHARE IT

News February 3, 2025

KKD: మద్యం షాపులో లాటరీ.. తగిలితే థాయ్‌లాండ్

image

మద్యం షాపులతో లాభం రాని వ్యాపారులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. కాకినాడ గుడారిగుంటకు చెందిన ఓ వ్యాపారి మందుబాబులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. తమ దుకాణంలో అన్ని రకాల బ్రాండ్‌లు దొరుకుతాయని.. పుల్ బాటిల్ కొంటే థాయిలాండ్ టూర్ వేళ్లే అదృష్టాన్ని పరీక్షించుకోండి అంటూ లాటరీ స్కీమ్ ప్రకటించారు. పరిసర ప్రాంతాల మందుబాబులు ఈ షాపు వద్దకు క్యూ కడుతున్నారు.

News February 3, 2025

పెదవేగి: పాత కక్షల నేపథ్యంలో పీక కోశారు

image

పాత కక్షల నేపథ్యంలో పెదవేగి మండలం, పినకడిమి గ్రామానికి చెందిన మరీదు మణికంఠ అనే వ్యక్తిపై ఆదివారం రాత్రి ఒక వ్యక్తి కత్తితో దాడి చేశారు. పీకను కోయడంతో మణికంఠ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు హుటాహుటిన క్షతగాత్రుడిని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మణికంఠ పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.