News February 3, 2025
KMR: జిల్లా వాసికి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు
కామారెడ్డి రక్త దాతల సమూహ నిర్వాహకులు డా. బాలుకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన తలసేమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం గతేడాది కామారెడ్డి జిల్లాలో 22 రక్తదాన శిబిరాలు నిర్వహించారు. 2306 యూనిట్ల రక్తాన్ని సేకరించి రికార్డు సృష్టించారు. భారతదేశంలోనే మొట్ట మొదటి సంస్థగా ‘ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ లో చోటు దక్కించుకున్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికి డా.బాలు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News February 3, 2025
ఏలూరు, నెల్లూరు డిప్యూటీ మేయర్లుగా టీడీపీ అభ్యర్థులు
AP: నెల్లూరు డిప్యూటీ మేయర్‌గా TDP అభ్యర్థి తహసీన్ ఎన్నికయ్యారు. ఆమెకు 41 ఓట్లు, YCP అభ్యర్థి కరీముల్లాకు 12 ఓట్లు పడ్డాయి. ఏలూరు డిప్యూటీ మేయర్లుగా TDP అభ్యర్థులు దుర్గాభవానీ, ఉమా మహేశ్వరరావు ఎన్నికయ్యారు. రెండు నామినేషన్లు మాత్రమే రావడంతో వారు ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు తిరుపతిలో YCP కార్పొరేటర్లను కూటమి నేతలు కిడ్నాప్ చేశారంటూ MP గురుమూర్తి, MLC సుబ్రహ్మణ్యం నిరసనకు దిగారు.
News February 3, 2025
ముమ్మిడివరం: పోలీసుల వేధింపులతో ఆత్మహత్య?
ముమ్మిడివరం: గేదెల్లంకకు చెందిన శివరామకృష్ణ (32) ఆత్మహత్య కలకలం రేపింది. శనివారం పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై ముమ్మిడివరం ఎస్సై జ్వాలాసాగర్ కేసు నమోదుచేశారు. శివరామకృష్ణకు 11 నెలల క్రితం పెళ్లయింది. మృతుడు HYD ఎల్బీనగర్లో ప్రూట్ జ్యూస్ దుకాణం నిర్వహించేవాడు. ఎల్బీనగర్‌లోని ఓ కానిస్టేబుల్ భార్య అదృశ్యంలో ఇతని పాత్ర ఉందని వేధించడమే ఆత్మహత్యకు కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
News February 3, 2025
కొడుకులు తరిమేశారు: వృద్ధ దంపతులు
కన్న కొడుకులు ఆస్తి రాయించుకుని తరిమేశారని డోన్ పట్టణానికి చెందిన వృద్ధ దంపతులు గంగిరెడ్డి, సుబ్బరత్నమ్మ వాపోయారు. తాము కష్టబడి సంపాదించిన ఇల్లు, ఆస్తులన్నింటినీ కుమారులు స్వాధీనం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని, పత్తికొండలోని శారదా వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నామని తెలిపారు. తమకు న్యాయం కావాలని కోరుతూ డోన్ డీఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.