News April 16, 2025
KMR: జిల్లాలో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

కామారెడ్డి జిల్లాలో గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఉష్ణోగ్రతల తాకిడికి గురవుతోంది. ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం నస్రుల్లాబాద్‌లో అత్యధికంగా 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా అత్యల్పంగా పిట్లంలో 39.4°లుగా నమోదైంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాతావరణం భరించలేని విధంగా మారింది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.
Similar News
News April 19, 2025
ఆ హామీ ఇప్పట్లో అమలు కాకపోవచ్చు: కూనంనేని

TG: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన తులం బంగారం హామీ ఇప్పట్లో అమలు కాకపోవచ్చని MLA కూనంనేని సాంబ శివరావు అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా ప్రభుత్వానికి కష్టంగా ఉందని వ్యాఖ్యానించారు. ఖమ్మంలో విమానాశ్రయం ఏర్పాటు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పరిస్థితి డోలాయమానంలో ఉందన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం కోసం ఎవరికీ రుపాయి కూడా ఇవ్వొద్దని సూచించారు.
News April 19, 2025
SUMMER హాలీడేస్.. ఆసిఫాబాద్‌ను చుట్టేద్దాం చలో

వేసవి సెలవులు ప్రారంభం కావడంతో ఎక్కడికి వెళ్లాలో ఆలోచిస్తున్నారా? ప్రకృతి రమణీయత చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలు మన జిల్లాలోనే ఉన్నాయి. ప్రాణహిత నది, పాలరాపులగుట్ట, సిద్ధప్ప గుహలు, సిర్పూర్ కోట, వట్టి వాగు, ఆడ ప్రాజెక్టు, జోడేఘాట్ కొమరం భీమ్ స్మృతి వనం, కంకాలమ్మ గుట్ట, శివ మల్లన్న దేవస్థానం, గంగాపూర్ బాలాజీ ఆలయాలున్నాయి. అందమైన ప్రదేశాలు దర్శించి మరపురాని జ్ఞాపకాలను సొంతం చేసుకుందాం..!
News April 19, 2025
SUMMER HOLIDAYS.. మంచిర్యాల చుట్టేద్దాం చలో

వేసవి సెలవులు షురూ కావడంతో ఎక్కడికి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారా? ప్రకృతి రమణీయత, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలు మంచిర్యాల జిల్లాలో ఉన్నాయి. గాంధారి ఖిల్లా, గూడెం శ్రీసత్యనారాయణ స్వామి దేవాలయం, కవ్వాల్ టైగర్ రిజర్వ్, శివ్వారం వన్యప్రాణుల అభయారణ్యం, గోదావరి నది, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఉన్నాయి. ఈ అందమైన ప్రదేశాలను సందర్శించి మరపురాని జ్ఞాపకాలు సొంతం చేసుకోండి!