News January 6, 2025

KMR: నవోదయలో లైంగిక వేధింపులు.. టీచర్లకు రిమాండ్‌

image

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయలో విద్యార్థులను లైంగికంగా వేధించిన నలుగురు ఉపాధ్యాయులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు. వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ వెల్లడించారు. ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు ఆ నలుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. గతంలో విద్యార్థులపై అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడిని కర్ణాటకకు బదిలీ చేశారు.

Similar News

News January 8, 2025

NZB: గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలి: కలెక్టర్

image

ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న ప్రభుత్వ గురుకులాల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. 2025-26 విద్యా సంవత్సరంలో వివిధ గురుకులాల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 23న కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. https://tgcet.cgg.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 01వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు.

News January 8, 2025

KTRలో భయం మొదలైంది: మహేశ్ కుమార్

image

KTRలో భయం మొదలయ్యిందని TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. డిచ్పల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మొన్నటి దాకా దమ్ముంటే అరెస్ట్ చేయండి.. జైలుకు వెళ్తా అని బీరాలు పలికిన KTR ఇప్పుడు విచారణ ఎదుర్కోవడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఏసీబీ కేసు కొట్టివేయాలని KTR హైకోర్టును ఆశ్రయిస్తే పిటిషన్ కొట్టివేయడంతో ఆయనలో భయం మొదలైందన్నారు.

News January 8, 2025

NZB: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బుజ్జగించిన నేతలు

image

నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన కాంగ్రెస్ పార్లమెంట్ స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ రావడం, అక్కడి పుస్తకంలో సంతకం చేసేందుకు చూడగా ఆయన పేరు లేకపోవడంతో అలిగి స్టేజ్ దిగిపోయారు. దీనితో కాంగ్రెస్ నాయకులు ఆయన్ను బుజ్జగించి తిరిగి స్టేజి పైకి తీసుకెళ్లడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.