News April 16, 2025

KMR: నీటి ఎద్దడి నివారణకు ట్యాంకర్ల ద్వారా సరఫరా: కలెక్టర్

image

కామారెడ్డి జిల్లాలో ఎక్కడా నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. పట్టణంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని సూచించారు. నూతనంగా కొనుగోలు చేసిన నీటి ట్యాంకర్లకు బుధవారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలో నీటి సరఫరాకు ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

Similar News

News April 19, 2025

అజహరుద్దీన్‌కు షాక్!

image

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్‌ అజహరుద్దీన్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. ఉప్పల్‌ స్టేడియంలో నార్త్‌ స్టాండ్‌కు ఆయన పేరును తొలగించాలని అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య HCAను ఆదేశించారు. లార్డ్స్‌ క్రికెట్‌ క్లబ్‌ వేసిన పిటిషన్‌పై అంబుడ్స్‌మన్‌ విచారణ చేపట్టారు. HCA అధ్యక్షుడిగా ఉన్న సమయంలో స్టాండ్స్‌కు తన పేరు పెట్టాలని అజర్‌ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం చెల్లదని తీర్పునిచ్చారు.

News April 19, 2025

సన్‌రూఫ్ కార్లపై తగ్గుతున్న ఇంట్రెస్ట్!

image

సన్‌రూఫ్ కార్లపై మక్కువ తగ్గిపోతోంది. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో 78శాతం మంది కార్ల కొనుగోలుదారులు సన్‌రూఫ్‌కి బదులుగా వెంటిలేటెడ్ సీట్లున్న కార్ మోడళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తేలింది. సన్‌రూఫ్ వల్ల ఏడాది పొడవునా వెచ్చగా, సమ్మర్‌లో మరింత వేడిగా ఉంటోంది. అదే వెంటిలేటెడ్ సీటుతో చల్లగా, వెచ్చగా మార్చుకునే సదుపాయం లభిస్తోంది. వీటిలో మీ ఛాయిస్ దేనికి? COMMENT

News April 19, 2025

మర్పల్లి: భూ భారతితో భూ సమస్యలకు పరిష్కారం: కలెక్టర్

image

భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూ భారతి ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శనివారం మర్పల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులకు సరైన విధంగా సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ పేర్కొన్నారు.

error: Content is protected !!