News January 21, 2025
KMR: నేటి నుంచి ప్రత్యేక నిర్ధారణ శిబిరాలు

కామారెడ్డి జిల్లాలోని దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు అందించుటకు ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు నియోజకవర్గాల వారీగా ప్రత్యేక నిర్ధారణ శిబిరాలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం కామారెడ్డి, దోమకొండ, పల్వంచ, బిక్కనూర్, మాచారెడ్డి, రామారెడ్డి, రాజంపేట, బిబిపేట్ ప్రాంతాల వారికి కామారెడ్డిలోని సిరిసిల్ల రోడ్‌లోని KVS గార్డెన్‌లో శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News March 14, 2025
మెదక్: చిరుత పులి దాడిలో లేగ దూడలు మృతి..?

మెదక్ జిల్లాలో చిరుత పులి సంచారం ఆందోళన కలిగిస్తోంది. రామాయంపేట మండలం దంతేపల్లి శివారులోని నక్కిర్తి స్వామి పొలం వద్ద పశువుల పాకపై అర్ధరాత్రి అడవి జంతువు దాడి చేసి రెండు దూడలను చంపేసింది. అయితే చిరుత దాడితోనే దూడలు మృత్యువాత పడ్డాయని బాధితులు పేర్కొన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. అయితే దాడి చేసింది ఏ జంతువు అనేది తెలియాల్సి ఉంది.
News March 14, 2025
బాలకృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కార్

HYDలోని జూబ్లీహిల్స్ రోడ్డు నెం.1లో నటుడు బాలకృష్ణ ఇంటి ముందున్న ఫుట్‌పాత్‌పైకి ఓ కారు దూసుకెళ్లింది. అతివేగంతో బాలకృష్ణ ఇంటి ముందున్న ఫెన్సింగ్‌ను కారు ఢీకొట్టింది. మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్డు నెం.45 మీదుగా చెక్ పోస్ట్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఫెన్సింగ్‌తో పాటు కారు ముందు భాగం ధ్వంసమైంది. కాగా.. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.
News March 14, 2025
NZB: హోలీ ప్రత్యేకం.. పూర్ణం భక్ష్యాలు, నేతి బొబ్బట్లు

నిజామాబాద్ జిల్లా కేంద్రం సకల సంప్రదాయాలకు నిలయం. మహారాష్ట్ర సంప్రదాయం అధికం. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలుగా మారిపోయే వేడుకంటే హోలీనే గుర్తొస్తుంది. ఈ వేళ విందు భోజనంలో నేతి బొబ్బట్లు, కోవా, కొబ్బరి, పూర్ణం భక్ష్యాలను చేసి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీ. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంటికి వచ్చి స్థిర నివాసం చేసుకుంటుందని భక్తుల విశ్వాసం.