News February 26, 2025
KMR: పది పరీక్షలు..ఎంత మంది రాయనున్నారంటే..?

పది పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసే పనిలో ఉంది. KMR జిల్లాలో పది వార్షిక పరీక్షలు 12,579 మంది విద్యార్థులు రాయనున్నారు. ఇందు కోసం 64 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పర్యవేక్షణకు..ఐదుగురు రూట్, 22 మంది కస్టోడియన్స్, 22 జాయింట్ కస్టోడియన్స్, 11 మంది సీ సెంటర్ కస్టోడియన్స్, ముగ్గురు ఫ్లయింగ్ స్క్వాడ్, 12 సిట్టింగ్ స్క్వార్డ్, 698 మంది ఇన్విజిలేటర్లను నియమించింది.
Similar News
News February 26, 2025
క్రికెటే నా ప్రాణం: రోహిత్ శర్మ

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ అంటే తనకు ప్రాణమని తాను బతికేదే ఆటకోసమని అన్నారు. ఛాంపియన్స్ ట్రోఫిలో ఇండియా సెమీస్ చేరటంపై రోహిత్ సంతోషం వ్యక్తం చేశారు. కోహ్లీ అంటే తనకెంతో ఇష్టమని.. ఇండియా విజయం కోసం అతను దేనికైనా సిద్ధంగా ఉంటాడని తెలిపారు. ప్రస్తుతం కప్పు గెలవటం పైనే తన పూర్తి ఫోకస్ ఉందని హిట్‌మ్యాన్ వివరించారు.
News February 26, 2025
స్టాలిన్ వ్యాఖ్యలను సమర్థించిన కేటీఆర్

జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే TNతో పాటు దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయన్న ఆ రాష్ట్ర CM స్టాలిన్ వ్యాఖ్యలను KTR సమర్థించారు. దేశానికి అవసరమైనప్పుడు ఈ రాష్ట్రాలే కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయని చెప్పారు. దేశాభివృద్ధిలో వీటి కృషిని గుర్తించకపోతే ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతింటుందన్నారు. దేశానికి ఆర్థిక తోడ్పాటు అందించే రాష్ట్రాల ఆధారంగా పునర్విభజన జరగాలని డిమాండ్ చేశారు.
News February 26, 2025
తమిళనాడులో చరిత్ర తిరగరాస్తాం: విజయ్

వచ్చే ఎన్నికల్లో తామే గెలుస్తామని సినీ నటుడు, టీవీకే చీఫ్ దళపతి విజయ్ ధీమా వ్యక్తం చేశారు. మహాబలిపురంలో టీవీకే పార్టీ మహానాడులో ఆయన మాట్లాడారు. 2026 ఎన్నికల్లో చరిత్ర తిరగరాస్తామని చెప్పారు. పెత్తందార్లు, భూస్వాములు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిచి సామాన్యులకు రాజ్యాధికారం కల్పిస్తామన్నారు. త్వరలోనే పార్టీలోకి కీలక నేతల చేరికలు ఉంటాయని తెలిపారు.