News March 24, 2025

KMR: పదో తరగతి పరీక్షలు.. 23 మంది గైర్హాజరు

image

కామారెడ్డి జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని జిల్లా విద్యాధికారి రాజు పేర్కొన్నారు. సోమవారం ఇంగ్లిష్ పరీక్ష జరగ్గా.. మొత్తం 12,579 విద్యార్థులకు గాను 12,556 మంది పరీక్ష రాయగా, 23 మంది పరీక్షకు హాజరు కాలేదని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించామని తెలిపారు.

Similar News

News March 29, 2025

నా సినిమా కోసం నేనెప్పుడూ ప్రార్థించలేదు: సల్మాన్

image

తన సినిమా హిట్ అవ్వాలని కోరుతూ ఎప్పుడూ దేవుడిని ప్రార్థించలేదని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ‘నా సినిమా విజయం సాధించడమనేది ప్రేక్షకుల దయపై ఆధారపడి ఉంటుంది. ‘మైనే ప్యార్ కియా’కి తప్పితే ఎప్పుడూ సినిమా సక్సెస్ చేయమంటూ దేవుడిని ప్రార్థించలేదు. నన్ను ప్రేమించేవాళ్లే నాకోసం ప్రార్థనలు చేస్తుంటారు. నేను ఉత్తమ నటుడిని అని ఎప్పటికీ అనుకోను’ అని పేర్కొన్నారు.

News March 29, 2025

KMR: ఉపకార వేతన దరఖాస్తు గడువు పెంపు

image

2024-25 విద్యా సంవత్సరానికి తాజా, రెన్యువల్ ఉపకార వేతనాలకు దరఖాస్తులకు గడువును మే 31 వరకు పొడిగించినట్లు కామారెడ్డి జిల్లా షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ అధికారిని రజిత శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వివిధ కళాశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు http://telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News March 29, 2025

NZB: మీ సేవ సర్వర్ డౌన్‌తో ఇబ్బందులు

image

మీ సేవ సెంటర్లలో శనివారం సర్వర్ డౌన్ ప్రాబ్లమ్ ఎదురైంది. దీనితో మీ సేవ సెంటర్లకు వెళ్లిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా విద్యార్థులు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లగా సర్వర్ డౌన్ చూపగా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సెంటర్లలో పడిగాపులు కాశారు. కాగా రాజీవ్ యువ వికాస పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు అధిక సంఖ్యలో అభ్యర్థులు రావడంతో ఈ ఇక్కట్లు అని తెలిసింది.

error: Content is protected !!