News March 28, 2025

KMR: పదో తరగతి పరీక్షలు.. గైర్హాజరు ఎంతంటే..?

image

కామారెడ్డి జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని DEO రాజు పేర్కొన్నారు. శుక్రవారం ఫిజికల్ సైన్స్ పరీక్ష జరగ్గా.. 12,579 విద్యార్థులకు 12,553 మంది పరీక్ష రాయగా, 26 మంది పరీక్షకు హాజరు కాలేదని ఆయన వివరించారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News April 2, 2025

వనపర్తి జిల్లాలో 1,59,353 రేషన్ కార్డులు: అదనపు కలెక్టర్ 

image

వనపర్తి జిల్లా వ్యాప్తంగా 1,59,353 తెల్ల రేషన్ కార్డులు ఉండగా 5,22,367 మంది కుటుంబ సభ్యులు ఉన్నట్లు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు వెల్లడించారు. రేషన్ కార్డులోని ఒక్కో కుటుంబ సభ్యుడికి నెలకు 6 కిలోల చొప్పున సన్న రకం బియ్యం ఉచితంగా ఇవ్వనున్నామన్నారు. దీనికోసం జిల్లాలో 3,309 మెట్రిక్ టన్నుల సన్న రకం బియ్యం అవసరమన్నారు. జిల్లాలోని 324 చౌక ధర దుకాణాల్లో సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

News April 2, 2025

నారాయణపేట జిల్లా పోలీసుల WARNING

image

నారాయణపేట జిల్లాలో ఈనెల 30 వరకు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ యోగేశ్ గౌతమ్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. పోలీసుల అనుమతులు లేకుండా రాజకీయ పార్టీలు, యువజన, రైతు, విద్యార్థి సంఘాలు ర్యాలీలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించొద్దని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

News April 2, 2025

రిషభ్ పంత్‌కు పంజాబ్ కింగ్స్ కౌంటర్

image

మెగా వేలం సమయంలో తమ ఫ్రాంచైజీని అవమానించిన లక్నో కెప్టెన్ రిషభ్ పంత్‌పై PBKS కౌంటర్ ఇచ్చింది. రాత్రి LSGపై మ్యాచ్ గెలిచిన తర్వాత ‘మెగా వేలం టెన్షన్ దానంతటదే ముగిసింది’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. కాగా వేలం అనంతరం పంత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘వేలంలో పంజాబ్ నన్ను ఎక్కడ కొంటుందో అని టెన్షన్ పడ్డా. శ్రేయస్ అయ్యర్‌ను దక్కించుకోవడంతో లక్నో టీమ్‌లో చేరగలనని భావించా’ అంటూ చెప్పుకొచ్చారు.

error: Content is protected !!