News April 3, 2025
KMR: పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్

మద్నూర్‌లో నిషేధిత అల్ఫాజోలం పట్టుబడ్డ కేసులో ఇది వరకే పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఓ పత్రికలో పని చేసే మరో వ్యక్తి పైయ్యర్ల శ్రీనివాస్ పరారీలో ఉండగా బుధవారం పట్టుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో నిషేధిత మత్తు పదార్థాలు కలిగి ఉన్న, సరఫరా చేసినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
Similar News
News April 4, 2025
జనగామ: ఈవీఎం గోదాంను పరిశీలించిన కలెక్టర్

జిల్లా సమీకృత కార్యాలయాల భవన సముదాయంలోని ఈవీఎం గోదాంను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా నమోదు పుస్తకం, సీసీ కెమెరాల పని తీరు, మంటల నియంత్రణ పద్ధతులను పర్యవేక్షించారు. భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీసు సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.
News April 4, 2025
బాసరలో వేద భారతి విద్యాలయంలో విషాదం

బాసర మండలకేంద్రంలోని వేద భారతి విద్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. గత కొద్ది రోజుల క్రితం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో దాడికి గురై విద్యార్థి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే ఓ విద్యార్థి శుక్రవారం ఉదయం బోరు బటన్ వేయడానికి వెళ్లి కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. వరంగల్ జిల్లాకు చెందిన మణికంఠగా గుర్తించారు. బాసర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
News April 4, 2025
నేరుగా OTTలోకి కొత్త సినిమా

మాధవన్, సిద్ధార్థ్, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన ‘టెస్ట్’ సినిమా OTTలో విడుదలైంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎస్.శశికాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను చక్రవర్తి రామచంద్ర నిర్మించారు. చెన్నైలో జరిగిన ఓ ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురి జీవితాలను ఎలా మార్చిందనే స్టోరీ లైన్‌తో ఈ స్పోర్ట్ డ్రామా రూపొందింది.