News April 2, 2025
KMR: ‘పరీక్షల భయానికి తెర.. విద్యార్థుల్లో ఆనందం’

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న పదో తరగతి పరీక్షలు నేటితో ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో సాంఘిక పరీక్ష సజావుగా జరిగింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా వ్యాప్తంగా చివరి పరీక్షకు 12,579 మంది విద్యార్థులకు 12,550 మంది హాజరు కాగా, 29 మంది గైర్హాజరైనట్లు జిల్లా విద్యాధికారి రాజు తెలిపారు.
Similar News
News April 4, 2025
ఆదిలాబాద్: డిగ్రీ విద్యార్థులకు GOOD NEWS

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును KU అధికారులు పొడిగించిన విషయం తెలిసిందే. కాగా వీటితో పాటు 1, 3, 5 సెమిస్టర్ పరీక్షలు సైతం రాసేందుకు అవకాశం కల్పించినట్లు KU అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో 1, 3, 5 పరీక్ష ఫీజును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 11 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News April 4, 2025
జీలుగుమిల్లి: శోకసముద్రంలో అంజలి కుటుంబ సభ్యులు

రాజమండ్రిలో ఆత్మహత్యాయత్నం చేసిన ఉమ్మడి ప.గో(D) జీలుగుమిల్లి మండలానికి చెందిన ఫార్మసీ విద్యార్థి నల్లపు అంజలి శుక్రవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఆమె స్వగ్రామం రౌతుగూడెంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మరికాసేట్లో ఆమె భౌతికకాయాన్ని గ్రామానికి తీసుకురానున్నారు. కుమార్తె మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. అంజలి ఆత్మహత్యకి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
News April 4, 2025
GNT: బాలిక మృతి కేసు.. స్పెషల్ వైద్య బృందం దర్యాప్తు

నరసరావుపేటలో బాలిక మృతి కేసును దర్యాప్తు చేయడానికి ప్రత్యేక వైద్య బృందం గురువారం మంగళగిరి ఎయిమ్స్‌లో సమావేశమైంది. ఈ బృందంలో ఢిల్లీ, ముంబయి నుంచి వచ్చిన నిపుణులు ఉన్నారు. వారు మృత బాలిక రక్త నమూనాలపై సమగ్ర సమాచారం సేకరించారు. అనంతరం దర్యాప్తు కొనసాగించేందుకు గుంటూరు వైద్య కళాశాలకు బయలుదేరి వెళ్లారు. ఈ బృందంలో వెటర్నరీ డాక్టర్ సహా మొత్తం ఐదుగురు డాక్టర్లు ఉన్నారు.