News March 20, 2025

KMR: పీజీ మొదటి సెమిస్టర్ ఫలితాల విడుదల

image

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిబ్రవరి నెలలో జరిగిన పీజీ ప్రథమ సంవత్సర(రెగ్యులర్) ఫలితాలను తెలంగాణ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రో.సంపత్ కుమార్, కళాశాల ప్రిన్సిపల్ కె. విజయ్ కుమార్ విడుదల చేశారు. ఈ పరీక్షలలో 75 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డా.కిష్టయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో TU అడిషనల్ కంట్రోలర్ సంపత్ అధికారులు ఉన్నారు.

Similar News

News March 28, 2025

శ్రీ సత్యసాయి జిల్లాలో 265 మంది విగైర్హాజరు

image

శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన పదో తరగతి పరీక్షకు 265 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణయ్య ఓ ప్రకటనలో తెలిపారు. శుక్రవారం జరిగిన బయోలాజికల్ సైన్స్ పరీక్షకు రెగ్యులర్ విద్యార్థులు 21,658 మందికి గానూ 21,429 మంది హాజరయ్యారన్నారు. ప్రైవేట్ విద్యార్థులు 429 మందికి గానూ 393 మంది హాజరయ్యారని చెప్పారు.

News March 28, 2025

మోదీ సర్.. తమిళనాడుతో జాగ్రత్త: విజయ్

image

డీలిమిటేషన్ పేరుతో తమిళనాడులో పార్లమెంటు సీట్ల సంఖ్యను తగ్గించేందుకు ప్రధాని మోదీ ప్రణాళికలు రచిస్తున్నారని TVK పార్టీ చీఫ్ విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రధాని గారూ.. మీరు వన్ నేషన్, వన్ ఎలక్షన్ అన్నప్పుడే మేం మీ ప్లాన్లను అర్థం చేసుకున్నాం. తమిళనాడును జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఈ రాష్ట్రం ఎన్నో సార్లు తన శక్తిని చూపించింది. మీరు జాగ్రత్తగా ఉండండి సర్’ అని సూచించారు.

News March 28, 2025

మయన్మార్, థాయిలాండ్‌కు అండగా ఉంటాం: మోదీ

image

మయన్మార్, థాయిలాండ్‌లో సంభవించిన భారీ భూకంపంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘భూకంప పరిస్థితులతో ఆందోళన చెందా. ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నా. ఇండియా వీరికి అండగా ఉంటుంది. సాయం చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ విషయంలో అధికారులు సిద్ధంగా ఉండాలని కోరాం. రెండు దేశాల ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలని విదేశాంగ మంత్రిత్వ శాఖకు సూచించా’ అని మోదీ Xలో రాసుకొచ్చారు.

error: Content is protected !!