News April 22, 2025

KMR: పోలీసు భద్రత పథకంతో ఆర్థిక భరోసా: SP

image

పోలీసు శాఖ అమలు చేస్తున్న ‘భద్రత’ పథకం ద్వారా పోలీసు కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తోందని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కానిస్టేబుల్ డి.రామన్ కుటుంబానికి సోమవారం జిల్లా ఎస్పీ రూ.8 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. చనిపోయిన సిబ్బంది కుటుంబాలకు పోలీసు శాఖ అన్నిరకాలుగా అండగా నిలుస్తుందని తెలిపారు.

Similar News

News April 22, 2025

మేలో సచివాలయాల సిబ్బంది బదిలీలు?

image

AP: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు కసరత్తు జరుగుతోంది. రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే జనరల్ కేటగిరీ సిబ్బంది కుదింపు పూర్తయ్యింది. మే మొదటి వారం నాటికి మిగిలిన 11 కేటగిరీల ఉద్యోగుల రేషనలైజేషన్ పూర్తవుతుందని సమాచారం. ఆ వెంటనే 2, 3 వారాల్లో బదిలీలను చేపడతారని తెలుస్తోంది. సచివాలయాల పరిధిలో జనాభా ఆధారంగా ఒక్కో ఆఫీసులో 6-8 మంది సిబ్బంది ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

News April 22, 2025

నంద్యాల: డ్రంక్ అండ్ డ్రైవ్‌.. రూ.10 వేల ఫైన్

image

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ వ్యక్తికి కోర్టు రూ.10వేల జరిమానా విధించిందని నంద్యాల జిల్లా రుద్రవరం SI వరప్రసాద్ తెలిపారు. మందలూరు గ్రామానికి చెందిన మిద్దె సన్నోడు అనే వ్యక్తి మద్యం మత్తులో వాహనం నడిపాడన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా ఆళ్లగడ్డ జేఎంఎఫ్‌సీ జడ్జి రూ.10వేల జరిమానా విధించినట్లు తెలిపారు.

News April 22, 2025

పోలీస్ కస్టడీకి గోరంట్ల మాధవ్

image

మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను గుంటూరు మొబైల్ కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ నెల 23, 24 తేదీల్లో రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు మాధవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. పోలీస్‌ సిబ్బందిపై దాడి కేసులో ఆయనను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

error: Content is protected !!