News April 11, 2025
KMR: పోలీస్ స్టేషన్ రైటర్లకు ఎస్పీ దిశానిర్దేశం..

కామారెడ్డి జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న రైటర్లతో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం సమావేశం అయ్యారు. నూతనంగా అమల్లోకి వచ్చిన చట్టాల్లోని ముఖ్యమైన అంశాలను ఎస్పీ వివరించారు. పోలీస్ స్టేషన్ రైటర్లు కేసుల నమోదు, దర్యాప్తు ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. కొత్త చట్టాలపై సరైన అవగాహన ఉంటేనే వారు సమర్థవంతంగా విధులు నిర్వర్తించగలరని స్పష్టం చేశారు.
Similar News
News April 19, 2025
అమరాపురం: ట్రాక్టర్ కిందపడి యువకుడి మృతి

ఉమ్మడి అనంతపురం జిల్లా అమరాపురం మండలంలోని కాచికుంటకు చెందిన యువకుడు మంజునాథ్ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాచికుంట గ్రామంలో ఓ రైతుకు చెందిన పొలంలో యువకుడు ట్రాక్టర్‌తో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. ఆ సమయంలో ట్రాక్టర్ అతనిపై నుంచి వెళ్లింది. యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 19, 2025
మంత్రుల పర్యటనతో రైతులకు చేసేందేమి లేదు: రామన్న

భూ భారతి పేరుతో ఆదిలాబాద్‌లో మంత్రులు పోగులేటి, సీతక్క పర్యటన రైతులకు చేసేందేమి లేదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి రజతోత్సవ సభను జయప్రదం చేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ నెల 27న కేసీఆర్ చేపట్టే సభ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
News April 19, 2025
ఆసిఫాబాద్ MPDO ఆఫీస్‌ను సందర్శించిన కలెక్టర్

రాజీవ్ యువ వికాసం పథకం కోసం వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. శనివారం ఆసిఫాబాద్ MPDO కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన సేవా కేంద్రాన్ని సందర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నుంచి ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం కింద అర్హులైన వారికి ఆర్థిక చేయూతనిచ్చేందుకు చేపడుతున్న దరఖాస్తుల స్వీకరణ పారదర్శకంగా జరుగుతోందని స్పష్టం చేశారు.