News April 7, 2025

KMR: ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్

image

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. కలెక్టర్ ఒక్కొక్క ఫిర్యాదును స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Similar News

News April 8, 2025

ఖానాపురం: రేషన్ లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే

image

ఖానాపురం మండల కేంద్రంలో ముస్తఫా అనే రేషన్ కార్డు లబ్ధిదారుడి ఇంట్లో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సన్న బియ్యం భోజనం చేశారు. ప్రభుత్వం పేదవాడి ఆకలి తీర్చేందుకు సన్న బియ్యం పథకాన్ని చేపడుతోందని దొంతి అన్నారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్, ఆర్డీవో ఉమారాణి, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

News April 8, 2025

ఆర్సీబీని వణికించిన హార్దిక్

image

నిన్న జరిగిన MIvsRCB మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచినప్పటికీ అది అంత సులువుగా రాలేదు. ముంబై కెప్టెన్ హార్దిక్ ఓ దశలో బెంగళూరు బౌలర్లను వణికించారు. ఎదుర్కొన్న తొలి మూడు బంతుల్ని 6, 4, 6 కొట్టిన ఆయన 8 బంతుల్లో 33 రన్స్ కొట్టి ఓ దశలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసేలా కనిపించారు. చివరికి 15 బంతుల్లో 42 పరుగులకు ఔటయ్యారు. అప్పటికి 11 బంతుల్లో 28 పరుగులు అవసరమైన ముంబై వరసగా వికెట్లు కోల్పోయి చతికిలబడింది.

News April 8, 2025

గాంధారి: అడవిలోకి తీసుకెళ్లి దాడి.. మహిళ మృతి

image

గాంధారి మండలం చందాపూర్ తండాకు రాజి అనే వ్యక్తి అమీనా బేగం అనే మహిళను అడవిలోకి తీసుకెళ్లి చితక బాదాడు. అరుపులు విన్న కొంతమంది ఆమెను గాంధారి ఆసుపత్రికి తరలించాగా.. చికిత్స పొందుతూ మరణించిందని గాంధారి ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. పోలీసుల వివరాలు.. హైదరాబాద్‌లో వారికి పరిచయం ఏర్పడిందని రాజి తన నాలుగేళ్ల బాబును ఆమె వద్ద ఉంచి వెళ్లగా ఆ మహిళా బాబును అమ్మేసిందని అనుమానంతో ఆమెపై దాడి చేశాడు.

error: Content is protected !!