News March 22, 2025
KMR: ప్రేమ పేరుతో వివాహం.. కుల వివక్షతతో పారిపోయిన భర్త

లింగంపేట్ మండలం కొమాట్‌పల్లికి చెందిన నెల్లూరి భాగ్య అదే గ్రామానికి చెందిన చిటురి రాకేశ్ ప్రేమ వివాహం చేసుకుని కడుపులో బిడ్డను చంపి అన్యాయం చేశాడని బాధితురాలు ఆరోపించింది. రోడ్డుపై వదిలేసి వెళ్లిపోడంటూ.. భర్త ఇంటి ఎదుట శుక్రవారం భార్య ఆందోళనకు దిగింది. 2023లో యాదగిరి గుట్టలో ప్రేమవివాహం చేసుకోని, మోసం చేసి పారిపోయాడని వాపోయింది. తనకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులతో ఆందోళన చేపట్టింది.
Similar News
News March 24, 2025
MBNR: ప్రజావాణిలో బాధితులు మొర

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సముదాయంలో ప్రజావాణికి బాధితులు క్యూ కట్టారు. ఈ ఫిర్యాదులో భాగంగా సోమవారం గిరిజన రుణాలు, భూమి, కార్మికుల, ప్రాజెక్టుల పరిహారం, సీనియర్ సిటిజన్స్, ఇందిరమ్మ ఇల్లు, భూముల కబ్జా, రైతులకుపంట నష్టపరిహారం తదితర సమస్యలపై జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయిని కలిసి తమ గోడును విన్నవించారు. వారు స్పందించి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్
News March 24, 2025
అతడు అడిగితే తప్ప సాయం చేయను: ధోనీ

CSK కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా పనిచేస్తున్నారని ఆ జట్టు మాజీ కెప్టెన్ ధోనీ కొనియాడారు. ‘రుతురాజ్ నన్ను అడిగితే తప్ప నేను సాయం చేయను. మైదానంలో ప్రతి నిర్ణయం అతడిదే. ఒకవేళ నేను ఏదైనా సలహా చెప్పినా అది కచ్చితంగా అనుసరించాలని అనుకోవద్దని తనకి ముందే చెప్పాను. కెప్టెన్‌గా రుతు ఉన్నా నిర్ణయాలు నేనే తీసుకుంటాననుకుంటారు చాలామంది. అందులో ఏమాత్రం నిజం లేదు’ అని స్పష్టం చేశారు.
News March 24, 2025
PES స్నాతకోత్సవంలో మాజీ చీఫ్ జస్టిస్ రమణ

కుప్పం పీఈఎస్ వైద్య కళాశాలలో 17వ స్నాతకోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. కళాశాల స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ హాజరైయ్యారు. పీఈఎస్ విద్యా సంస్థ అధినేత దొరస్వామి నాయుడుకు నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఆధునిక టెక్నాలజీతో పరుగులు పెడుతున్న నేటి ప్రపంచంలో వైద్య విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకొని భవిష్యత్‌కు బంగారు బాట వేసుకోవాలని సూచించారు.