News April 8, 2025

KMR: బాలుర అదృశ్యం సుఖాంతం.. SP అభినందన

image

ఇద్దరు బాలుర అదృశ్యం కేసును బీర్కూర్ పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. వివరాల్లోకి వెళితే.. బీర్కూర్ జ్యోతిబాఫూలేలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు 7వ తేదీన రాత్రి 9 గం.ల నుంచి కనిపించకుండా పోయారు. 8న సాయంత్రం కుటుంబ సభ్యులు PSలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వారిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసు సిబ్బందికి ఎస్పీ అభినందించారు.

Similar News

News April 19, 2025

కంది: జిరాక్స్ సెంటర్లు ముసి ఉంచాలి: డీఈఓ

image

జిల్లాలో రేపటి నుంచి ప్రారంభమయ్యే ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పబ్లిక్ పరీక్ష కేంద్రాల వద్ద ఉన్న జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్‌లను మూసివేయాలని జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పరీక్షలు సజావుగా జరిగేందుకు పరీక్ష కేంద్రాల సిబ్బంది అందరూ కృషి చేయాలని కోరారు.

News April 19, 2025

ప్రవీణ్ శరీరంపై 18 గాయాలున్నాయి: హర్షకుమార్

image

పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో పోస్టుమార్టం రిపోర్టు బహిర్గతం చేయడానికి ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ నిలదీశారు.శుక్రవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రవీణ్ కేసులో పోలీసుల దర్యాప్తును తనతో సహా ఎవ్వరూ విశ్వసించడం లేదని వ్యాఖ్యానించారు. తన వద్దకు వచ్చిన పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం ప్రవీణ్‌పై 18 శరీరంపై గాయాలున్నాయని, ఇది ముమ్మాటికీ హత్యే అని పేర్కొన్నారు.

News April 19, 2025

NKP: భూ భారతి చట్టంతో భూ సమస్యలు వేగంగా పరిష్కారం

image

భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని, గ్రామాల్లో చేపడుతున్న రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యల పరిష్కారానికి దరఖాస్తు చేసుకోవాలని ఇంచార్జ్ కలెక్టర్ డా. పి. శ్రీజ తెలిపారు. నేలకొండపల్లి మండలం చెరువు మాధారం, కొత్త కొత్తూరు గ్రామాలలో చేపట్టిన రెవెన్యూ సదస్సులను ఇంచార్జ్ కలెక్టర్ తనిఖీలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు ఉన్నారు.

error: Content is protected !!