News April 24, 2025
KMR: భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులు: కలెక్టర్

భూ భారతి చట్టంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత చర్యలు చేపట్టింది. ఈ మేరకు KMR జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. గురువారం బీర్కూర్, నసురుల్లాబాద్‌లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. భూమికి సంబంధించిన కొత్త చట్టంపై ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయడమే ఈ సదస్సుల ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు.
Similar News
News April 25, 2025
ములుగు: రజతోత్సవ సభ వేదిక సిద్ధం

ఈనెల 27న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ 25 వసంతాల రజతోత్సవ సభకు సభా ప్రాంగణం సిద్ధమైంది. సభా ప్రాంగణంలో భారీ వేదికను సిద్ధం చేశారు. మహిళలు పురుషులకు వేర్వేరుగా సభా ప్రాంగణంలో కూర్చోవడానికి ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ సభకు భారీ జన సమీకరణకు ఏర్పాట్లు చేసింది.
News April 25, 2025
రావికమతం: జాతీయస్థాయి బోసి పోటీలకు ఎంపికైన బాల సరస్వతి

రావికమతం మం. కేబీపీ అగ్రహారానికి చెందిన దివ్యాంగురాలు నక్కరాజు బాల సరస్వతి జాతీయస్థాయి బోసి పోటీలకు ఎంపికైందని ఉపాధ్యాయుడు బొడ్డు మహాలక్ష్మి నాయుడు గురువారం తెలిపారు. రాష్ట్ర సమగ్ర శిక్ష, స్పెషల్ ఒలంపిక్ భారత క్రీడా సంస్థ సంయుక్తంగా విజయవాడలో నిర్వహించిన దివ్యాంగుల ఆటల పోటీల్లో బాల సరస్వతి ఉత్తమ ప్రతిభ కనబరిచిందన్నారు. దీంతో చత్తీస్‌గడ్‌లో నిర్వహించనున్న పోటీలకు ఆమెను ఎంపిక చేశారని వెల్లడించారు.
News April 25, 2025
పంచాయతీరాజ్ పాత్ర కీలకమైంది: కర్నూలు కలెక్టర్

గ్రామీణాభివృద్ధి, స్థానిక పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. గురువారం కర్నూలు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ షెడ్యూల్లో 243 ఆర్టికల్ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను రూపొందిస్తూ చట్టం చేశారన్నారు.