News March 28, 2025

KMR: మాథ్స్ ప్రశ్నలు లీక్‌లో అరెస్టయ్యింది వీరే (UPDATE)

image

జుక్కల్‌లో గణిత పరీక్ష ప్రశ్నలు లీకైన కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. SP రాజేష్ చంద్ర వివరాలను వెల్లడించారు. ఓ తండ్రి తన కుమారుడి కోసం ఎగ్జామ్ సెంటర్‌లో వాటర్ సప్లయ్ చేసే వ్యక్తితో ప్రశ్నలు బయటకు తెప్పించాడు. కొంతమంది అతడి నుంచి ప్రశ్నలు తీసుకొని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. జాదవ్ సంజయ్, ముబీన్, మనోజ్, వరప్రసాద్, హన్మండ్లు, గంగాధర్‌లను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశామన్నారు.

Similar News

News December 14, 2025

MBNR: ఈనెల 22 నుంచి “టీ-20 క్రికెట్ లీగ్”

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం పిల్లమర్రి రోడ్డు సమీపంలోని క్రికెట్ మైదానంలో ఈనెల 22 నుంచి 26 వరకు విశాఖ ఇండస్ట్రీస్ సౌజన్యంతో హెచ్సీఏ ఆధ్వర్యంలో జి.వెంకటస్వామి కాక మెమోరియల్ ఉమ్మడి జిల్లా టీ-20 క్రికెట్ లీగ్ నిర్వహిస్తున్నట్లు ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ ‘Way2News’తో తెలిపారు. మహబూబ్ నగర్, NGKL, NRPT, GDWL, WNPT జట్లు పాల్గొంటాయని, ప్రతి జట్టు నాలుగేసి మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుందన్నారు.

News December 14, 2025

రాహుల్ పర్యటనపై బీఆర్ఎస్ విమర్శలు

image

TG: కాంగ్రెస్ అగ్రనేత <<18553262>>రాహుల్<<>> హైదరాబాద్ పర్యటనపై BRS విమర్శలకు దిగింది. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రక్తమోడుతుంటే TG వచ్చేందుకు ఆయనకు సమయంలేకుండా పోయిందని <>Xలో<<>> దుయ్యబట్టింది. ‘గత రెండేళ్లలో రాష్ట్రంలో 828 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 117 మంది స్కూల్ విద్యార్థులు చనిపోయారు. అనేక విధాలుగా ప్రజలు ఇబ్బందిపడ్డారు’ అని రాసుకొచ్చింది. రాష్ట్ర ప్రజలు మీ మోసాన్ని గుర్తుంచుకుంటారని పేర్కొంది.

News December 14, 2025

చైనా మాంజ విక్రయించినా, వినియోగించినా చర్యలు: NZB CP

image

సంక్రాంతి పండగ వస్తున్న తరుణంలో గాలిపటాల విక్రయ కేంద్రాల్లో చైనా మాంజాలు విక్రయించవద్దని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హెచ్చరించారు. చైనా మాంజా వల్ల ఎవరికైనా ప్రాణ హాని కలిగితే హత్య నేరం కింద కేసు నమోదు చేస్తామన్నారు. చైనా మాంజా విక్రయించినా, వినియోగించినా పోలీస్ స్టేషన్‌ లేదా 100కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.