News February 12, 2025

KMR: యాక్సిడెంట్‌లో వ్యక్తి మృతి

image

వర్ని మండలం జాకోరా ఎక్స్ రోడ్డు వద్ద బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మరణించాడు. స్థానికులు 108కు, పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే వ్యక్తి మృతి చెందినట్లు 108 సిబ్బంది తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వివరించారు. వ్యక్తిని గుర్తించిన వారు వర్ని పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్‌ఐ రమేశ్ పేర్కొన్నారు.

Similar News

News February 13, 2025

విజయసాయి రెడ్డి స్థానంలో కన్నబాబు

image

AP: వైసీపీలో పలు నియామకాలకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ఆమోదం తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్‌గా కురసాల కన్నబాబును నియమించారు. గతంలో ఈ స్థానంలో విజయసాయి రెడ్డి ఉండేవారు. అలాగే కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా దాడిశెట్టి రాజాను నియమిస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది.

News February 13, 2025

రాయపోల్: రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి.. గ్రామస్థుల ఆందోళన

image

రాయపోల్ మండలం అంకిరెడ్డిపల్లి వద్ద రోడ్డు దాటుతున్న ఆటో డ్రైవర్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. వీర నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ జాలిగామ ఐలయ్య ఈరోజు సాయంత్రం సిమెంట్ కోసం అంకిరెడ్డిపల్లి వద్దకు వచ్చి ఆటోను నిలిపి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. నిందితుడిని పట్టుకోవాలని గ్రామస్థులు గజ్వేల్ చేగుంట రహదారిపై ఆందోళన చేపట్టారు.

News February 13, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లా ముఖ్యంశాలు

image

@ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి కాంగ్రెస్ ఓట్లు అడగాలి: బీజేపీ నేతలు@ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలి: మాస్టర్ ట్రైనర్లు @ 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదు: బ్లాక్ కాంగ్రెస్ @రోడ్డు పనుల్లో అధికారుల జాప్యం @రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో డ్రైనేజీ శుభ్రం చేస్తున్న అధికారులు @వేములవాడ రాజన్న సేవలో యూఎస్ఏ భక్తురాలు @CC రోడ్డు డ్రైనేజీ నిర్మాణపనులు ప్రారంభం

error: Content is protected !!