News March 31, 2025
KMR: రంజాన్ వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎస్పీ

కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం రంజాన్ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పాల్గొని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏ.ఎస్పి చైతన్య రెడ్డి. జిల్లా అధికారులు ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు.
Similar News
News April 3, 2025
చిత్తూరు: నేటి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు

చిత్తూరు జిల్లావ్యాప్తంగా ఈనెల 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఆధార్ స్పెషల్ క్యాంపులను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆరేళ్ల లోపు పిల్లలకు, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూపులకు ఆధార్ నమోదు ప్రక్రియ చేపట్టనున్నట్లు చెప్పారు. ఎంపిక చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లో స్పెషల్ క్యాంపులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఈనెల 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మరో విడత క్యాంపులు నిర్వహించనున్నారు.
News April 3, 2025
ముగిసిన పదిపరీక్షలు.. పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి!

నిన్నటితో పదోతరగతి పరీక్షలు ముగిశాయి. దీంతో విద్యార్థులు ఫ్రీ బర్డ్స్ లాగా తిరగాలని భావిస్తారు. కాబట్టి తల్లిదండ్రులు వారి కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు బైకులు ఇవ్వొద్దని, స్నేహితులతో చెరువులకు వెళ్లకుండా చూడాలన్నారు. వారు ఈత నేర్చుకుంటానంటే పేరెంట్సే పర్యవేక్షించాలని, మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నారో లేదా గమనిస్తూ ఉండాలంటున్నారు.PLEASE SHARE IT.
News April 3, 2025
వరంగల్: ముగిసిన పదిపరీక్షలు.. పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి!

న్నటితో పదోతరగతి పరీక్షలు ముగిశాయి. దీంతో విద్యార్థులు ఫ్రీ బర్డ్స్ లాగా తిరగాలని భావిస్తారు. కాబట్టి తల్లిదండ్రులు వారి కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు బైకులు ఇవ్వొద్దని, స్నేహితులతో చెరువులకు వెళ్లకుండా చూడాలన్నారు. వారు ఈత నేర్చుకుంటానంటే పేరెంట్సే పర్యవేక్షించాలని, మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నారో లేదా గమనిస్తూ ఉండాలంటున్నారు.