News April 4, 2025
KMR: షబ్బీర్ అలీకి మంత్రి పదవి ఖాయమేనా?

రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్న షబ్బీర్ ఆలీకి మంత్రి పదవి దక్కడం ఖాయమని చర్చ జరుగుతోంది. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మంత్రి వర్గ విస్తరణలో ఒక మైనార్టీ ఉంటారని చేసిన ప్రకటన ఇందుకు ఊతం ఇస్తోంది. ఈ ప్రకటన.. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీల ఎంపికలో చోటు దక్కక నిరాశలో ఉన్న షబ్బీర్ ఆలీతో పాటు ఆయన అనుచరుల్లో మళ్లీ ఆశలు రేకెత్తిస్తోంది.
Similar News
News April 18, 2025
చిత్తూరు: ఆర్టీసీ షాపులకు టెండర్లు

చిత్తూరు జిల్లాలోని ఆర్టీసీ పరిధిలో ఉన్న వివిధ షాపుల నిర్వహణకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు డీపీటీవో జితేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 24వ తేదీ లోపు ఆయా డిపోల పరిధిలో టెండర్లు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. చిత్తూరులోని ఆర్టీసీ బస్టాండ్ డీపీటీవో కార్యాలయంలో 25వ తేదీ టెండర్ల ప్రక్రియ జరుగుతుందన్నారు.
News April 18, 2025
విజయవాడలో రేపు జాబ్ మేళా

NTR వికాస సౌజన్యంతో శనివారం విజయవాడ కలెక్టరేట్ కార్యాలయంలో ఉద్యోగమేళా జరగనుంది. SSC, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ పాసైన 18- 35 ఏళ్లలోపు వయసున్నవారు ఈ ఉద్యోగమేళాకు హాజరు కావొచ్చని నిర్వాహకులు తెలిపారు. కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, సాఫ్ట్‌వేర్ డెవలపర్, సేల్స్ ఫోర్స్ డెవలపర్, టెక్నీషియన్, టెలి సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతాయని, ఆసక్తి కలవారు హాజరు కావాలని సూచించారు.
News April 18, 2025
రాష్ట్రానికి రూ.28,842 కోట్ల మద్యం ఆదాయం

AP: ఈ ఏడాది రాష్ట్రానికి మద్యం అమ్మకాల ద్వారా భారీ ఆదాయం సమకూరినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. 2024-25 ఏడాదికిగానూ రూ.28,842 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించింది. పన్నుల రూపంలో రూ.24,731 కోట్లు, వైన్స్, బార్లు, డిస్టిలరీల లైసెన్స్ ఫీజుల రూపంలో రూ.2,206 కోట్లు, దరఖాస్తు రుసుముల రూపంలో రూ.1,905 కోట్లు వచ్చినట్లు వివరించింది. ఈ ఏడాది మద్యం అమ్మకాల్లో 14 శాతం వృద్ధి సాధించినట్లు పేర్కొంది.