News February 6, 2025
KMR: సైబర్ మోసాలపై జర జాగ్రత్త..!
సైబర్ మోసగాళ్లు అమాయకులను ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచుకుంటున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. బ్యాంకుల నుంచి వచ్చే నకిలీ ఫోన్ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని, కొంత పెట్టుబడి పెడితే ఎక్కువ సంపాదించవచ్చని ఆశచూపి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలన్నారు. కామారెడ్డి ఇందిరానగర్ ZPHSలో సైబర్ జాగృత దివస్ సందర్భంగా కానిస్టేబుల్ ప్రవీణ్ అవగాహన కల్పించారు.
Similar News
News February 6, 2025
జక్రాన్‌పల్లి: విలువైన నిషేదిత మత్తు పదార్థాల దహనం
నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 154 కేసులలో పట్టుబడిన రూ.12కోట్ల విలువైన నిషేదిత మత్తు పదార్థాలను జక్రాన్పల్లిలోని శ్రీ మెడికేర్‌లో గురువారం దహనం చేశారు. ఈ మేరకు డ్రగ్ డిస్పోజల్ కమిటీ అమోదించిన నిషేదిత మత్తు పదార్థాలైన 1700 కిలోల ఎండు గంజాయి, 64.27 కిలోల అల్ఫాజోలం, 72.2 కిలోల డైజీపాం, ఒక గంజాయి మొక్కను దహనం చేశారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.
News February 6, 2025
NZB: ఉపాధ్యాయులకు డీఈవో నోటీసులు
సమయానికి పాఠశాలకు హాజరు కాని నలుగురు ఉపాధ్యాయులకు డీఈవో అశోక్ షోకాజ్ నోటీసులను జారీ చేశారు. గురువారం నిజామాబాద్ వినాయకనగర్ ప్రాథమికోన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఆ సమయంలో టీచర్లు రాకపోవడంతో నోటీసులు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాఠశాల సమయానికి ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించడంతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
News February 6, 2025
NZB: జూనియర్ కళాశాలను DIEO తనిఖీ
నిజామాబాద్ నగరంలోని కోటగల్లీ గర్ల్స్ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి (DIEO) రవి కుమార్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కళాశాలలో నిర్వహిస్తున్న ప్రయోగ పరీక్షను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల్లో జియో ట్యాగింగ్ చేయాలని, కెమెరాలు పని చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా పరీక్షలు జరుగుతున్న మరికొన్ని కళాశాలలను ఆయన తనిఖీ చేశారు.