News March 13, 2025

KMR: హోలీని సురక్షితంగా జరుపుకోవాలి: SP

image

కామారెడ్డి జిల్లా ప్రజలు హోలీ పండుగను సురక్షితంగా, ఆనందంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర కోరారు. గురువారం ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించేలా మద్యం మత్తులో వాహనాలు నడుపోద్దన్నారు. చెర్వుల్లో, కుంటల్లో లోతైన నీటిలోకి వెళ్లి ప్రమాదబారిన పడవద్దని సూచించారు. సురక్షితమైన రంగులను వాడి హోలీ జరుపుకోవాలన్నారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు.

Similar News

News March 14, 2025

రేపటి నుంచి ఒంటిపూట బడులు: DEO

image

ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు పాఠశాలలకు ఒంటి పూట బడులు నిర్వహించాలని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక ఆదేశించారు. ఉదయం 7.45 ని.ల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు స్కూల్స్ నిర్వహించాలన్నారు. 10వ తరగతి పరీక్షా కేంద్రాలున్న పాఠశాలలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5గంటల తరగతులు పెట్టాలని చెప్పారు. ఎండ తీవ్రత దృష్టిలో ఉంచుకొని పాఠశాలల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచాలన్నారు.

News March 14, 2025

MBNR: పెళ్లై వారం రోజులే.. అప్పుడే అనంతలోకాలకు!

image

వారం రోజుల క్రితమే పెళ్లైన ఓ యువకుడు రోడ్డుప్రమాదంలో మృతిచెందిన ఘటన MBNRలో గురువారం చోటుచేసుకుంది. SI రామ్‌లాల్ నాయక్ వివరాలు.. సీసీకుంట ఫర్డీపూర్‌కు చెందిన రాజు(30) బైక్‌పై లాల్‌కోటకు వెళ్తున్నాడు. మద్యంమత్తులో ఉన్న రమేశ్ బైక్‌పై లాల్‌కోట-ఫర్డీపూర్ వస్తూ రాజు బైక్‌ను ఢీకొట్టగా తీవ్రంగా గాయపడ్డ అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!