News December 29, 2024

KNL: కానిస్టేబుళ్లకు ఫిజికల్ టెస్ట్ ట్రయల్ రన్ 

image

కర్నూలులోని ఏపీఎస్పీ 2వ బెటాలియన్ రేపటి నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు నిర్వహించే దేహదారుడ్య పరీక్షల(ట్రయల్ రన్) రీహర్సల్‌ను ఎస్పీ జి.బిందు మాధవ్ పరిశీలించారు. PMT/PET పరీక్షలను పకడ్భందీగా, పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. కాగా దేహదారుడ్య పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా RFID సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాట్లు చేయాలని ఎస్పీ ఆదేశించారు.

Similar News

News October 19, 2025

కర్నూలు: 9 నెలల్లో 6,858 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

image

కర్నూలు రేంజ్‌లో 9 నెలల్లో మద్యం మత్తులో వాహనాలు నడిపిన 6,858 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ వివరాలు వెల్లడించారు. రహదారి భద్రతలో భాగంగా ప్రతి రోజు వాహన తనిఖీలు నిర్వహించి, డ్రైవర్లకు కౌన్సెలింగ్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 13,555 మందిపై కూడా కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

News October 19, 2025

లిక్కర్ షాపుల కోసం రూ.4.5 కోట్లు పెట్టిన కర్నూలు మహిళ

image

కర్నూలు జిల్లాకు చెందిన ఓ మహిళ తెలంగాణలోని 150 వైన్ షాపులకు దరఖాస్తు చేసింది. ఇందుకోసం ఆమె రూ.4.5 కోట్లు చెల్లించింది. ఏపీకి సరిహద్దుల్లో ఉండే జిల్లాల్లోని షాపులకు ఈమె ఎక్కువగా దరఖాస్తు చేసినట్టు సమాచారం. ఆమెకు ఏపీలోనూ ఎక్కువ దుకాణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 23న డ్రా ద్వారా వైన్ షాపులకు లైసెన్స్ ఇవ్వనున్నారు.

News October 19, 2025

జిల్లా కలెక్టర్ డా.సిరి హెచ్చరిక.!

image

దీపావళి సందర్భంగా కేటాయించిన ప్రదేశాలలోనే టపాకాయలు విక్రయించాలని, నిబంధనలకు అనుగుణంగా పర్యవేక్షించాలని శనివారం కలెక్టర్ ఆర్డీవోలు, తహసీల్దార్లకు సూచించారు.
అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీపావళి సంతోషంగా జరుపుకోవాలని, బాణాసంచా కాల్చే సమయంలో ముఖ్యంగా చిన్న పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ ప్రజలను విజ్ఞప్తి చేశారు.